ఫన్ బకెట్ అనే కామెడీ సిరీస్ గత కొంతకాలం క్రితం బాగా ఫేమస్ అయింది. ఈ సిరీస్ వలన భార్గవ్ తో పాటు పలువురు యాక్టర్లకు కూడా మంచి ఫేమ్ వచ్చింది. మంచి నేమ్ రావడం తో ఈ సిరీస్ ను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ వీరి వీడియోస్ యు ట్యూబ్ లో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. అయితే.. ఉన్నట్లుండి ఫన్ బకెట్ భార్గవ్ పై ఆరోపణలు రావడం మొదలయ్యాయి.

bhargav 1

మైనర్ బాలికను రేప్ చేసాడని.. అమ్మాయిలతో అసభ్యం గా ప్రవర్తించేవాడని.. ఇలా రకరకాలుగా ఆరోపణలు వచ్చాయి. వీటిల్లో వాస్తవం ఎంతో తెలియకపోయినా.. నెటిజన్లు ఫన్ బకెట్ భార్గవ్ ను తిట్టి పోశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయమై మాట్లాడడం తో.. అందరు నిజమనే నమ్మారు. మరో వైపు న్యూస్ ఛానెల్స్ లో కూడా ఈ వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై స్పందించిన భార్గవ్ ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పాడు. తనపై ఈ కేసు ఎందుకు బుక్ అయిందో తెలియదన్నారు.

bhargav 2

రూమర్ చాలా తొందరగా వ్యాపించేస్తుందని అన్నారు. ఇంకా ఈ కేసు విషయం లో తొందరగా బెయిల్ రావడం పై నెటిజన్లకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయితే.. దీని గురించి తనకు తెలియదని.. తనపై ఎందుకు తప్పుడు కేసు వేసారో కూడా తెలియదని భార్గవ్ చెప్పారు. కోర్టు నుంచి వెళ్లే సమయం లో రెండు జతల బట్టలు.. బుక్స్ కూడా తీసుకెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు. అంతకుముందు రోజే..బుక్స్ షాపింగ్ చేసానని.. బుక్స్ ని మాత్రం తీసేస్కున్నట్లు చెప్పారు. ఆ తరువాత తిరిగి ఇచ్చారని.. కానీ ఆ క్షణం మాత్రం బాగా బాధకలిగిందన్నారు.

bhargav 3

ఈ కేసు కోర్టులో నడుస్తోందని.. తనపై ఎందుకు ఆరోపణలు వచ్చాయో.. తప్పుడు కేసు ఎందుకు వేసారో తేలుతుందని అన్నారు. ఇంకా ఈ కేసు నమోదయ్యాక ఏమి జరిగిందో కూడా భార్గవ్ వివరించారు. భార్గవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ను ఈ కింద వీడియో లో చూడొచ్చు.