సడన్ గా ఎదురింట్లో అది చూసి భయపడ్డా…చివరికి అదేంటో తెలుస్తే నవ్వాపుకోలేరు..!

సడన్ గా ఎదురింట్లో అది చూసి భయపడ్డా…చివరికి అదేంటో తెలుస్తే నవ్వాపుకోలేరు..!

by Mohana Priya

Ads

భువనేశ్వర్ కి చెందిన కార్తీక్ చెప్పిన కథ ఆధారంగా రాయబడినది.

Video Advertisement

నాకు పరీక్షలు ఉన్నాయి. వాటి కోసం ప్రిపేర్ అవుతూ ఇవాళ పొద్దున చదవడం మొదలు పెట్టాను. నా రూం మధ్యలో కూర్చుంటే వెలుతురు సరిగ్గా రావట్లేదు. అందుకే నా గది దగ్గర ఉన్న కిటికీ దగ్గర ఉన్న నా స్టడీ టేబుల్ దగ్గర కూర్చుని చదువుదాం అనుకున్నాను. ఇది నా టేబుల్.

పరీక్షలు కాబట్టి పుస్తకాలన్నీ చిందరవందరగా ఉన్నాయి. టేబుల్ మీద దగ్గర కూర్చొని చదువుతున్నాను. అప్పుడే హఠాత్తుగా దీని పైకి నా దృష్టి మళ్ళింది.

కనిపించిందా ? ఒకవేళ కనిపించకపోతే ఇది చూడండి.

ఇప్పుడు కనిపించిందా? భయపడ్డారా? చూసినప్పుడు నాకు కూడా అలానే భయమేసింది? ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. గదిలో గాలి ఉన్నాకూడా చెమటలు పట్టేసాయి. ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. నోట్లో నుండి మాటరాలేదు. ఇంకా అది నన్నే చూస్తున్నట్టు అనిపిస్తోంది.

దాంతో ప్రాణం ఆగిపోయినంత పనైంది. మెల్లగా అది కదిలి నట్టు అనిపించింది. నేనింక అయిపోయాను అనుకున్నా. నా దగ్గరికి వస్తుందేమో పారిపోవాలి అని లేవబోతున్నా. మెల్లగా ఆ రూపం మారుతోంది. సినిమా లో దెయ్యాలు గాలిలో ఎగురుతున్నప్పుడు మారుతుంది కదా అలా అవుతోందేమో అనుకున్నా. కానీ ఆ ముఖం రూపం పోయి అక్కడ తెల్లగా ఏదో ఉన్నట్టు అయిపోయింది.

ఇలా అయ్యింది. నాకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పటివరకు ఉన్న రూపం ఎక్కడికి వెళ్ళిపోయింది. బహుశా నా గది దగ్గరకు అయితే రాలేదు కదా? అని ధైర్యం తెచ్చుకొని ఒకసారి గది మొత్తం చూశాను హమ్మయ్య ఎక్కడా లేదు. ఒకసారి మళ్లీ ఆ కిటికీ ని పరిశీలించి చూసాను.

అప్పుడు అర్థమైంది అక్కడ ఏముందో. అది ఒక క్లాత్. ఆ  ఇంట్లో వాళ్ళ పూజగది కి ఆ కిటికీ ఆనుకొని ఉంటుంది. పూజ చేసినప్పుడు ఉపయోగించే బట్ట ని వాళ్లు అక్కడ తగిలిస్తారట. భయం పోయి ఒక్కసారిగా నా మీద నాకే నవ్వొచ్చింది. ఏంటి ఇలా భయపడ్డాను అని. మొదటిసారి చూసినపుడు మీరు కూడా ఉలిక్కి పడ్డారు కదా? ఒకసారి మీరు కూడా భయపడకుండా జాగ్రత్తగా పరిశీలించి చూడండి మీకు కూడా అర్థమవుతుంది.


End of Article

You may also like