మన కష్టం, ఇష్టంలో పాలు పంచుకుంటూ, బ్లడ్ రిలేషన్ లేకున్నా మనకు చివరిదాకా తోడుగా ఉంటూ ,తప్పు చేస్తే దండిస్తూ ,ఒప్పు చేస్తే బుజం తడుతూ ఉండేవాడే ఫ్రెండ్ అంటే.ఇదంతా మాకు తెలుసు అందుకేగా నిన్న ఫ్రెండ్ షిప్ డే చేసుకుంది.

అయిన ఇంతకీ ఇప్పుడు నువ్వు ఇదంతా ఎందుకు చెబుతున్నావు అని మీరు నన్ను అడగచ్చు అక్కడికే వస్తున్నా నిన్న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వాట్స్ అప్ చాట్ భయంకరంగా వైరల్ అయ్యింది.తీరా చూస్తే ఆ మెసేజ్ నాకు వచ్చిందే.

ఆ మెసేజ్ చూసిన నేను ఉదయం ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ లాగ షాక్ తిని సైలంట్ అయిపోయాను. మధ్యాహ్నానికి త్రివిక్రమ్ సినిమాలో కామెడీ చూసినట్టు ఆ మెసేజ్ ను చూస్తూ పకపక నవ్వేశాను.

ఇంతకీ ఆ చాట్ లో ఏముంది చెప్పారా బాబు అని తిట్టుకోకండి ఇక లేట్ చేయకుండా అక్కడికే వస్తున్న నాకు ఒక అనౌన్ నంబర్ నుండి ఫ్రెండ్ షిప్ డే విషెస్ వచ్చాయి.అది చూసి ఎవరు బ్రో మీరు అని రిప్లై ఇచ్చాను.దానికి అటు నుండి బ్రో మీ ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు కదా అని అన్నాడు.రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే వాడు మిగతా మ్యాటర్ టైప్ చేసేలోపే నువ్వు రాహుల్ ఫ్రెండ్ వా అని అడిగాను.అటు నుండి కాదు బ్రో రాహుల్ కు శివ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు.నేను వాడి ఫ్రెండ్ ను అని అన్నాడు.దానికి నేను ఓ…ఇంతకీ నాకెందుకు విష్ చేశారు బ్రో అని అమాయకంగా అడిగాను.దానికి అటు నుండి నేను యూజ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ పాస్వర్డ్ లు నీవే బ్రో అందుకే విష్ చేస్తున్న అని షాకింగ్ రిప్లై ఇచ్చాడు.

మొదట ఇది చూసి షాక్ తిన్న తర్వాత ఎవరికీ పనికి రావనే మా నాన్న మాటలు గుర్తొచ్చాయి.ఆయనకు జరిగిన సంఘటన చెప్పి నా ఫ్రెండ్ కే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేను ఉపయోగపడుతున్నాను అని గర్వంగా చెబుదామనుకున్నా కానీ మా నాన్న పంచ్ పవర్ కు భయపడి సైలెంట్ గా నవ్వుకున్నా మీరు కూడా ఆ చాట్ పై ఓ లుక్ వేయండి.