ఈమె కొడుకుని ఎలా బకరా చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..! తెలివి మాములుగా లేదుగా..! (వీడియో)

ఈమె కొడుకుని ఎలా బకరా చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..! తెలివి మాములుగా లేదుగా..! (వీడియో)

by Anudeep

Ads

ఈ కాలం పిల్లల్ని పట్టుకోలేమండి బాబూ అని చేతులెత్తేస్తే ఎవరికైనా నడుస్తుందేమో కానీ అమ్మలకు మాత్రం ఆ అవకాశం లేదు.జమానే కే సాత్ చలో అన్నారు పెద్దలు…అందుకే మారుతున్న ‌జనరేషన్స్ తో‌ పాటే పిల్లల పెంపకంలోనూ అమ్మల అప్రోచ్ మారాల్సిందే …అమ్మతనానికి కొన్ని ‌క్రియేటివ్ స్కిల్స్ జోడించాల్సిందే…అని నిరూపిస్తుంది ఈ అమ్మ.

Video Advertisement

పిల్లలకు అన్నం తినిపించాలంటే , ఒకప్పుడు మన అమ్మావాళ్లు చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ, చందమామని చూపిస్తూ ముద్దుగా  తినిపించేవాళ్లు . అంతకూ వినని పిల్లలకైతే బూచాడొస్తాడు అన్నం తినకపోతే ఎత్తుకెళ్లిపోతాడు అని భయపెట్టి తినిపించేవాళ్లు. నేటి తరం అమ్మలు మొబైల్ చేతిలో పెట్టి పిల్లలతో తిండి తినిపిస్తున్నారు. కానీ ఈ ఫోర్ జి జనరేషన్ అమ్మ ఏం చేసిందో చూడండి.

ఏడాది వయసున్న తన  పిల్లాడికి ఫూడ్ పెట్టాడానికి తను పడుతున్న పాట్లని, చేస్తున్న ఫీట్లని చాలా క్రియేటివ్ గా నలుగురికి నచ్చేలా వీడియోస్ తీసి టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తుంది మనస్టోరీలో అమ్మ .పిల్లలు అన్నం తినడానికి మారం చేస్తారు కాని కలర్ ఫుల్ కవర్స్ లో కనపడే చాక్లెట్స్ ,చిప్స్ తినడానికి ఆసక్తి చూపిస్తారు.

వాళ్ల వీక్నెస్ ఈ అమ్మకు ప్లస్ అయింది. జెమ్స్ ప్యాకెట్లో ఎంచక్కా దానిమ్మ గింజలని వేసి ఆ ప్యాకెట్ సుపుత్రుడి చేతికిచ్చింది . వాడు కూడా ఎంచక్కా లాగించేసాడు . అలాగే బనానాని లేస్ ప్యాకెట్లో , ఐస్ క్రీమ్ బదులు ఐస్ క్రీమ్ పుల్లకి బనాని గుచ్చి వాడితో తినిపించేస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆహ్లాదానికి ఆహ్లాదం.

ఇప్పుడు ఈ తల్లీ కొడుకుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అంతేకాదు  సోషల్ మీడియా స్టార్ మదర్ గా ఆ తల్లిని పొగిడేస్తున్నారు కూడా. ఈ వీడియోలను చూసి మీరు కూడా ఇకపై పిల్లలు ఫూడ్ విషయంలో దూసుకెళ్లండి, మా పిల్లలు ఫూడ్ తినరు అని కంప్లైంట్స్ మానేయండి. అందరిని అలరిస్తున్న ఆ వీడియోస్ పై  మీరూ ఒక లుక్కేయండి.

watch video:


End of Article

You may also like