మనిషి మనుగడకి ఆహరం అత్యవసరమైనది. అయితే.. ప్రాంతాలు, అక్కడి పరిస్థితుల రీత్యా ఆహారపు అలవాట్లు అనేవి ఏర్పడ్డాయి. ఏ ప్రాంతంలో అయినా దొరికే ఆహార పదార్ధాలను బట్టి వంటకాలు ఏర్పడతాయి. అందుకే ఒక్కో ప్లేస్ లో ఒక్కో ఫుడ్ ఫేమస్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు రవాణా వ్యవస్థ కానీ, ఇంటర్నెట్ సదుపాయాలు కానీ లేవు కాబట్టి అప్పుడు ఆహార పదార్ధాల విషయంలో పూర్తి అవగాహన ఉండేది కాదు. ఎక్కడ దొరికిన ఆహార పదార్ధాలపైనే అక్కడి వారు ఆధారపడేవారు.

Video Advertisement

ప్రస్తుతం పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కొత్త రుచులను చూడడం వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆహార ప్రియత్వంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పలు ప్రదేశాలలో లభ్యమయ్యే ఆహార పదార్ధాల రుచులను ట్రై చేయడంలో ప్రజలు ముందుంటున్నారు.

indian food 1

మెక్సికన్ ఫుడ్, చైనీస్ ఫుడ్, అమెరికన్ ఫుడ్ అని ఇండియాలో ఎలా దొరుకుతున్నాయి.. అలాగే.. ఇండియాలో బాగా పాపులర్ అయిన బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ, దోస, వడ వంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇతర దేశాలలో కొన్ని రెస్టారెంట్స్ లలో దొరుకుతూ ఉంటాయి. అలాగే.. భారతీయులు ఎక్కువగా నివాసం ఉంటున్న అమెరికాలో కూడా భారత ఫుడ్ ఐటమ్స్ బాగానే దొరుకుతాయి. అయితే.. ఈ ఫుడ్ ఐటమ్స్ కు పెట్టిన పేర్లు చూస్తేనే మనకు నవ్వాగదు.

indian food 3

ఇక్కడి ఫుడ్ ఐటెమ్స్ కి వారికి తోచినట్లు ఇంగ్లీష్ పేర్లు పెట్టేసుకున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. మన రెస్టారెంట్స్ లో దొరికే ప్లైన్ దోసెకి వారు “నేక్డ్ క్రేప్” అనే పేరు పెట్టారు. ఇక సాంబార్ ఇడ్లీకి అయితే “డంక్డ్ రైస్ కేక్ డిలైట్” అని పేరు పెట్టారు. వడకి “డంక్డ్ డోనట్ డిలైట్” అని పేరు పెట్టారు. వీటి పేర్లు విచిత్రంగా ఉన్నాయి.

indian food 2

పేర్లు మాత్రమే కాదు.. వీటి ధరల్ని చూస్తే కూడా ఆశ్చర్య పోవాల్సిందే. ఒక్క ప్లేట్ ధర ఇండియన్ కరెన్సీలో 1400 ల రూపాయల నుంచి 1500 ల వరకు ఉంది. అయితే.. ధరల సంగతి ఎలా ఉన్నా.. ఫుడ్ ఐటెమ్స్ పేర్లని కూడా మార్చడంపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల ఫుడ్ ఐటమ్స్ ఐన పిజ్జా, మెక్సికన్ ఫుడ్, నూడుల్స్ ఇలా అన్ని ఫుడ్స్ ని వాటి పేర్లతోనే ఇండియాలో కూడా పిలుస్తున్నారని.. కానీ ఇండియన్ ఫుడ్ పేర్లని మాత్రం మార్చాల్సిన అవసరం ఏముంది అని మండిపడుతున్నారు.