Ads
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరు సాధించింది. హార్డ్‌హిట్టర్ క్రిస్‌గేల్(99: 63 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది.చివరి ఓవర్‌లో ఆర్చర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతిని భారీ సిక్సర్ కొట్టిన గేల్.. 99 పరుగుల వద్ద ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్ట్ అయ్యాడు. దాంతో ఫ్రస్ట్రేషన్‌లో బ్యాట్‌ని విసిరికొట్టాడు గేల్. బ్యాట్ చాలా దూరం ఎగిరిపోయి పడిపోయింది. అయితే ఆ వెంటనే బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను మెచ్చుకొని క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video Advertisement
#IPL2020 #KXIPvRR #RRvsKXIP : Chris Gayle Wicket pic.twitter.com/G1OxALwaEX
— IPL 2020 HIGHLIGHT (@ipl2020highlite) October 30, 2020
— Simran (@CowCorner9) October 30, 2020
End of Article