Ads
మెగాస్టార్ చిరంజీవికి సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమా ఫలితాలతో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న “గాడ్ ఫాదర్” తో చిరు సక్సెస్ సాధించాల్సి ఉంది.
Video Advertisement
నాగార్జున మన్మథుడు 2తో ఆకట్టుకోకపోగా, బంగార్రాజుతో విజయం సాధించినా ఆ సక్సెస్ ఆయన రేంజ్ కు తగినది కాదు. తర్వాత చిత్రాలతో నాగ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. నాగ్ ప్రస్తుతం “ది ఘోస్ట్” సినిమాలో నటిస్తున్నారు.
గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు దసరా పండగకి అక్టోబర్ 5న ప్రేక్షకులముందుకు రానున్నాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. టీజర్ చూస్తూ ఉంటే ఇది ఒక హారర్ కామెడీ సినిమా అని అర్థం అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పాట రిలీజ్ చేశారు. ఆ పాటని మంచు విష్ణు కూతుర్లు అరియానా-వివియానా పాడారు. ఆ పాటలో వారు కనిపిస్తారు. ఈ సినిమాలో మంచు విష్ణు గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమా హారర్ కామెడీ అని టీజర్ చూసేంత వరకు ప్రేక్షకులకు అర్థం అవ్వలేదు.
చాలాకాలంగా మంచు విష్ణు సినిమాలు హిట్ అందుకోలేదు. ఈ సినిమాతో విష్ణు హిట్ కొడతారు అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు కూడా అప్పుడే విడుదల అవుతుండడంతో….ఈ సినిమా రిసల్ట్ ఏమవుతుందా అనే టాక్ కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. ‘గాడ్ ఫాదర్’ ‘ఘోస్ట్’ ల పక్కన ‘జిన్నా’ నిలబడుతుంది అంటారా.?
End of Article