అసలు మంచు విష్ణుకి సుడిగాలి సుధీర్ కి కంపారిజన్ ఏంటి అనుకుంటున్నారా..? లేక ఎందుకు వీళ్ళిద్దరిని పోల్చాల్సి వస్తోంది అని ఆలోచిస్తున్నారా. మరేం లేదు మంచు విష్ణు హీరోగా నటించిన “జిన్నా” మూవీకి , సుధీర్ హీరోగా చేసిన “గాలోడు” సినిమాకి మధ్య జరిగిన చిన్న కంపారిజన్ ఫలితమే ఇది.

Video Advertisement

సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక్కొక్కసారి ఎవరి ఊహకి అందనివి, విచిత్రమైనవి అయిన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మరి అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. మంచి సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ తో ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన నట వారసుడు మంచు విష్ణు ఓపక్క…బుల్లితెర మీద కామెడీ ,రియాల్టీ షోలతో పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ మరోపక్క.

sudheer fans fire on galodu movie..

బుల్లితెర మీద తన కామెడీతో మంచి క్రేజ్ సంపాదించిన సుధీర్ ఆ మధ్య ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని రీసెంట్ గా ‘గాలోడు’ మూవీతోె మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే దీనికి మంచు విష్ణు కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా , ఆ విషయానికి వస్తున్నా….

reasons behind ginna movie negative talk

ఈ శుక్రవారం అంటే నవంబర్ 18న ‘గాలోడు’ మూవీ రిలీజ్ అయింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరూ ఊహించనంత భారీ వసూళ్లను ఈ చిత్రం తొలి రోజే రాబట్టింది. ఆంధ్రాలో 36 లక్షలు సీడెడ్ లో ,18 లక్షలు నైజాంలో, అయితే ఏకంగా 47 లక్షలు బాక్స్ ఆఫీస్ వసూళ్లతో ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు కోటి పైన కలెక్షన్ రాబట్టింది.

రీసెంట్ గా రిలీజ్ అయిన మంచు విష్ణు “జిన్నా” మూవీ వరల్డ్ వైడ్ క్లోసింగ్ గ్రాస్ కలెక్షన్ ఇంచుమించు 70 లక్షలు.
అయితే ‘గాలోడు’కేవలం ఒకే ఒక్క రోజులో కోటి రూపాయల పైనే గ్రాస్ వసూలు చేసింది. అంటే మంచు విష్ణు మూవీ ఆల్ టైం కలెక్షన్స్ …. ఒక చిన్న హీరో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ దాటడంతో ఫిలిం ఇండస్ట్రీ అవాక్కయ్యింది.