పెళ్లి అనేది చిన్న విషయం కాదు. ఇద్దరు మనుషులు ఒకటిగా మారి నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన జీవితం. అందువల్లే పెళ్లి విషయంలో పెద్దలు ఎంతో ఆలోచించి, ఆచి తుచి అడుగులు వేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో యువకులు ఒక్క వివాహం చేసుకోవడానికే ఎన్నో బాధలు పడుతుంటే, ఒక వ్యక్తి మాత్రం అవలీలగా 105 పెళ్లిళ్లు చేసుకుని అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు.

Video Advertisement

విస్తుపోయే మరో విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ఒక్కరికి కూడా విడాకులు ఇవ్వకుండానే అంతమందిని వివాహం చేసుకున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆ వ్యక్తి గురించిన వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంది. 105 పెళ్లిళ్లు చేసుకున్న అతని పేరు గియోవన్నీ విగ్లియోటో. సిసిలీలో ఉన్న సిరాకుసాలో 1929లో ఏప్రిల్ 3న ఆ వ్యక్తి  జన్మించాడు. అయితే విచారణ టైమ్ లో ఆ వ్యక్తి తన నిజమైన పేరు నికోయ్ పెరుస్కో అని తెలిపాడు. తన అసలైన గుర్తింపు ఫ్రెడ్ జిప్ అని వెల్లడించాడు. గియోవన్నీ 1949 నుండి 1981 మధ్య కాలంలో 105 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. story-of-the-man-who-married-105-womenఅయితే ఆ వ్యక్తి తన భార్యలకు ఒకరి గురించి ఇంకొకరికి తెలియకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలో అమెరికాలోని రాష్ట్రాలలో మాత్రమే కాకుండా పద్నాలుగు వేరే దేశాలలోని మహిళలను కూడా వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ప్రతిసారీ నకిలీ పత్రాలతో, పేర్లు మార్చుకుని సదరు మహిళలతో పరిచయం చేసుకునేవాడు. కొంతకాలం తరువాత ప్రపోజ్ చేయడం, వివాహం చేసుకునేవాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తరువాత దూర ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నానని, అక్కడికి వెళ్లాలని చెప్పేవాడు.
story-of-the-man-who-married-105-women1 ఆ తరువాత ఆమెకు సంబంధించిన డబ్బు, నగలను, ఖరీదైన వస్తువులను తీసుకుని పారిపోయేవాడు. పోలీసులకు దొరికే దాకా ఇదే పద్ధతిని కొన్నేళ్ళ పాటు కొనసాగించాడు. ఆఖరికి 1981లో డిసెంబర్ 28న గియోవన్నీ విగ్లియోటో పోలీసులకి దొరికాడు. కోర్టు అతడు చేసిన నేరానికి  ముప్పై నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటుగా, 336,000 డాలర్ల జరిమానా విధించింది. 105 పెళ్లిళ్లు చేసుకుని, అంత మంది యువతులను మోసం చేసిన గియోవన్నీ విగ్లియోటో 61 ఏళ్ల వయస్సులో 1991లో  మెదడులో రక్తస్రావం జరిగి, కన్నుమూశాడు.story-of-the-man-who-married-105-women2Also Read: తన చావుకి తానే ఏర్పాట్లు చేసుకున్నాడు..! ఇతని కథ వింటే కన్నీళ్లు ఆగవు..!