Home Sports Adda “అఫ్గానిస్థాన్ తో ఇండియా మ్యాచ్‌కి ఈ అమ్మాయి వస్తుందా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.! ఇంతకీ ఆమె ఎవరంటే.?

“అఫ్గానిస్థాన్ తో ఇండియా మ్యాచ్‌కి ఈ అమ్మాయి వస్తుందా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.! ఇంతకీ ఆమె ఎవరంటే.?

by Anudeep

అఫ్గానిస్తాన్‌ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆఫ్ఘన్ అభిమాని వాజ్మా అయూబీ అందర్నీ ఆకర్షించింది. 2022 ఆసియా కప్ భారీ ప్రదర్శనలతో వినోదభరితంగా సాగిపోతుంది. ఈ నేపథ్యంలో మొన్న ఆగస్ట్ 30, 2022న జరిగిన అఫ్గానిస్తాన్‌ vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో వాజ్మా అయూబీ అనే అఫ్గాన్‌ అమ్మాయి తన అందం తో అందరినీ కట్టిపడేసింది. బౌండరీ లైన్‌ వద్ద అఫ్గాన్‌ జెండా పట్టుకొన అయూబీ అందానికి ఆరోజు స్టేడియంలోని ప్రేక్షకులే కాకుండా టీవీలో మ్యాచ్‌ చూసిన వారు కూడా ఫిదా అయ్యారు.

షార్జా క్రికెట్ స్టేడియంలో ఎంతో ఉత్కంఠత మధ్య సాగిన అఫ్గానిస్తాన్‌ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కు హాజరైన ఈ అఫ్గాన్‌ అభిమాని ప్రస్తుతం తన హాట్ లుక్స్ తో నెట్ లో వైరల్ అయింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన అఫ్గానిస్తాన్‌ సూపర్ 4 లోకి ఎంటర్ అయిన మొదటి జట్టుగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “కంగ్రాట్స్‌ బ్లూ టైగర్స్‌” అని అయూబీ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ కొద్ది సేపటికే వైరల్ అయ్యింది.

girl in ind vs afg asia cup

ఆమె అందానికి ముగ్దులైన టీమ్ ఇండియా అభిమానులు కొంతమంది ఆమె ట్వీట్ కు “భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కి మీరు అక్కడ ఉంటారా?” అని కామెంట్స్ పెట్టారు. ఇంతకీ టీమిండియాకు , అఫ్గానిస్తాన్‌కు మధ్య జరిగే మ్యాచ్‌కు ఆమె వస్తుందో లేదో తెలియదు కానీ…. తన అందంతో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మాత్రం మారిపోయింది. ఒకవేళ వాజ్మా ఈ మ్యాచ్ కు హాజరైతే మాత్రం అందరి కళ్లు ఆమెవైపు ఉంటాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

girl in ind vs afg asia cup

ఇక జరగబోయే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం హాంకాంగ్ తో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్ 4లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ మరియు సూర్య కుమార్ తమ ప్రతిభను చాటారు. ఈ నేపథ్యంలో వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్‌ 6న టీమిండియా.. అఫ్గానిస్తాన్‌తో పోరుకు సిద్ధమవుతోంది.

girl in ind vs afg asia cup

ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించాలని అభిమానుల ఆకాంక్ష. అయితే అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ ఆదివారం అంటే సెప్టెంబర్‌ 4న ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడే అవకాశముంది. కానీ ఇది జరగాలంటే పాకిస్తాన్ హాంకాంగ్ తో జరిగే ఈరోజు మ్యాచ్ లో గెలిచి సూపర్ 4 లోకి ఎంటర అయ్యి తీరాల్సిందే. ఏది ఏమైనప్పటికి ఈ సంవత్సర ఆసియా కప్ మాత్రం ఎంతో ఉత్కంఠత నడుమ సాగుతోంది. ప్రతి టీం ప్లేయర్స్ తమ వినూత్నమైన పర్ఫామెన్స్ తో అభిమానులకు కనులవిందు చేస్తున్నారు.

You may also like