అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటున్నారు. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 .

Video Advertisement

 

బద్దకస్తుడిగా పేరు తెచ్చుకున్న ఓ పోలీస్ ఆఫీసర్‌ దేశమే ఉలిక్కిపడే క్రైమ్‌ను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతకీ అతడు నేరస్థుడిని ఎలా పట్టుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రమే ‘హిట్: ది సెకెండ్ కేస్’. ఈ చిత్రం మంచి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది.

missed logics in hit 2 movie..!!

అయితే ఈ చిత్రం లో ఒక సైకో కిల్లర్.. ఒక అమ్మాయి ని దారుణంగా హింసించి చంపుతాడు. మర్డర్ కి గురైంది ఒక అమ్మాయి మాత్రమే కాదు ఆ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాలతో కలిసి ఉందని రివీల్ అవుతుంది. దీన్ని పోలీస్ ఆఫీసర్ ఎలా చేధించాడు అన్నదే కథ. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఒక అమ్మాయి చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

missed logics in hit 2 movie..!!

” నాని గారు నిర్మిస్తున్న అన్ని హిట్ సినిమాల్లో అమ్మాయిలే చనిపోతున్నారు కదా.. నాని గారు మీరు తీసే నెక్స్ట్ హిట్ 3 సినిమాలో ఒక అమ్మాయి కిల్లర్ గా ఉండాలి.. అబ్బాయిలను చంపాలి. మీకు చేతకాకపోతే చెప్పండి నేనే ఆ రోల్ చేస్తా..” అంటూ ఒక అమ్మాయి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ గా స్పందిస్తున్నారు.

girl reaction went viral after watching hit 2 movie..!!

నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ త్రిపిరినేని నిర్మించిన చిత్రం హిట్ 2. ఈ క్రైమ్ థిల్లర్ మూవీ కి హిట్ మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను నే దర్శకుడు. హిట్ సినిమాకి సీక్వెల్ గా రావడం, ట్రైలర్స్, పాటలు కూడా ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది.

 

watch video: