మంచి పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ పోతినేని నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధంగా ఉంది.

Video Advertisement

ఊర మాస్ లుక్ తో ఉన్న రామ్ సినిమా ఎంత సాలిడ్ ఎంటర్టైనరో చెప్పకనే చెబుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్కీన్‌ పతాకంపై ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

girl who is seen in skanda trailer

ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే ఒక అమ్మాయికి గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. “కనిపించని దేవుని కనిపించమని అడుగుతాం కానీ, పెంచే దేవుళ్ళని పట్టించుకోకపోతే ఎలా మామయ్య?” అని రామ్ పోతినేని ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ సమయంలో ఒక్కక్షణం కెమెరా ఒక అమ్మాయి ముఖం మీద జూమ్ అవుతుంది.

girl who is seen in skanda trailer

అందానికి మారుపేరుగా తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అమ్మాయి ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్. అమ్మాయి పేరే అమృత చౌదరి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఆద్యంతం పవర్ ఫుల్ డైలాగ్స్ తో సాగే ఈ ట్రైలర్ మంచి మాస్ టచ్ తో సాలిడ్ ఎంటర్టైనర్ గా ఉంది. ఇక ఇందులో ఆద్యంతం ప్రతి డైలాగులు బోయపాటి ట్రేడ్ మార్క్ కనిపిస్తుంది. రెండు ఊర్ల మధ్య జరిగే పదవి పోరాటంలో హీరో కుటుంబం పై విలన్ కన్ను వేయడం…హీరో చెల్లెల్ని విలన్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం.. తర్వాత ఆమెను వారు చంపేసినట్లు చూపిస్తారు.

girl who is seen in skanda trailer

కథ రొటీన్ గా ఉన్నప్పటికీ కథనం వెరైటీగా ఉండొచ్చు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అమృత చౌదరి కి ఇన్స్టా లో 679 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2022లో విడుదలైన ద రాక్ స్టార్ అనే చిత్రంలో అమృత హీరోయిన్ గా నటించింది. అయితే ఇన్స్టా లో మాత్రం ఎప్పటికప్పుడు వీడియోస్ మరియు పిక్స్ తో నెటిజన్స్ కు కనువిందు చేస్తూ ఉంటుంది.

ALSO READ : BIGG BOSS TELUGU-7 : అసలు ఎవరు ఈ పల్లవి ప్రశాంత్..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?