వివాదాల డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ పొలిటికల్‌ మూవీగా ‘వ్యూహం’ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు రొటీన్ సినిమాలను చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. చాలా రోజులుగా వర్మ ‘శారీ ‘ అనే మూవీని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

Video Advertisement

రీసెంట్ గా వర్మ చీర కట్టులో ఉన్న ఒక అమ్మాయి ఫోటోను చూశాడు. ఆ అమ్మాయి ఎవరు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని పోస్ట్‌ పెట్టాడు. ఆర్జీవి అడిగిన వెంటనే ఆమె గురించి వివరాలు తెలుపుతూ నెటిజెన్లు పోస్ట్ లు పెట్టారు. దాంతో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఒక సాధారణ అమ్మాయిని కూడా స్టార్ సెలబ్రిటీగా చేయగల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు.  సినిమాలలో నటించడం వల్ల అమ్మాయిలు సెలబ్రిటీలుగా మారతారు. అయితే రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడిన అమ్మాయి నటించ ముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే అలా సెలబ్రిటీ అయినవారు ఉన్నారు. అయితే తాజాగా ఒక అమ్మాయి ఆర్జీవి దృష్టిలో పడింది.తాజాగా ఆ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీని తెలుసుకున్న వర్మ ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడీని పోస్ట్ చేస్తూ “ఇంత వరకు చాలా మంది చీరలోని అందం గురించి చెప్పారు. కానీ నేను ఈ వీడియో చూసే వరకు నేను ఎప్పుడూ నమ్మలేదు, కానీ ఆమెను చూశాకా అర్థమైంది” అంటూ ఒక పోస్ట్ చేసి, ఆమె రీల్ వీడియోను కూడా షేర్ చేశాడు. అందులో శ్రీలక్ష్మీ సతీష్ తో  శారీ (చీర) మూవీ తీస్తాను అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.
ప్రస్తుతం ఈ దర్శకుడి దృష్టి శ్రీలక్ష్మి పైనే ఉందని టాక్. శ్రీలక్ష్మీ సతీష్ కూడా సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. ఆమె ఇన్ స్టా ఖాతాలో రీల్ వీడియోలను చూస్తుంటే, ఆమెకు హీరోయిన్ కావాలనే కోరిక ఉన్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఆమె గురించి ట్వీట్ చేయకముందు ఆమెకు 20 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే వర్మ ట్వీట్ చేశాక, ఆమె ఫాలోవర్లు 50 వేలకు చేరారు.

Also Read: “చంద్రముఖి 2” మూవీలో రజనీకాంత్ పోషించిన రాజు పాత్ర చేసిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?