ఐపీఎల్ 2023లో సోమవారం జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. ఈ సీజన్ లో వరుసగా రెండో గెలుపును ఢిల్లీ జట్టు నమోదు చేసింది.

Video Advertisement

ఈ మ్యాచ్ హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ ను తిలకించడానికి సినీ సెలెబ్రెటీస్ కూడా వచ్చారు. సింగర్ రాహుల్ సింప్లిగంజ్, నటి మరియు యాంకర్ వర్షిణి ఉప్పల్ స్టేడియంకు వచ్చారు. వీరితో పాటు  మరొక అమ్మాయి కూడా అక్కడి వారందరినీ ఆకర్షించింది. మరి ఆమె ఎవరో? ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆమె పేరు రాశి సింగ్.  ఆది సాయికుమార్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ‘శశి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ చిత్రం 2021లో విడుదల అయ్యింది. ఆమె వృత్తి రీత్యా ఎయిర్ హోస్టెస్. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన పై ఉన్న ఇష్టంతో టను చేసే పనిని వదిలి ఇండస్ట్రీకి వచ్చింది. పోస్టర్, రత్నం సినిమాలలోనూ నటించింది. ఇటీవల శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ సినిమాలో రాశి సింగ్‌ హీరోయిన్ గా నటించింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరి మీద ఆదారపడకూడదని, ఏదైనా నేర్చుకోవలనే ఉద్దేశ్యంతో ఎయిర్ హోస్టెస్‌ వృత్తిని ఎంచుకున్నానని తెలిపింది. ఎయిర్‌లైన్స్‌లో పని చేశానని, దాని కోసమే తాను హైదరాబాద్‌కు మారాల్సి వచ్చిందని తెలిపింది. ఆ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు రావడం వెనుక నా ఉద్యోగం కూడా ఒక కారణం అని అన్నారు. నటిని కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. అవకాశం వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారి పక్కన నటించాలనేది తన కల అని అన్నారు.రాశి సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా వేలల్లో ఉన్నారు. ఇక సోమవారం ఉప్పల్ స్టేడియంలో మెరిసిన ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజెన్లు ఆన్లైన్ లో తెగ వెతుకుతున్నారు.

Also Read: బాలకృష్ణ వాడే “విగ్” ఖరీదు ఎంతో తెలుసా..? అసలు విషయం బయట పెట్టిన మేకప్ మాన్..!