బాలకృష్ణ వాడే “విగ్” ఖరీదు ఎంతో తెలుసా..? అసలు విషయం బయట పెట్టిన మేకప్ మాన్..!

బాలకృష్ణ వాడే “విగ్” ఖరీదు ఎంతో తెలుసా..? అసలు విషయం బయట పెట్టిన మేకప్ మాన్..!

by kavitha

Ads

సినిమాలలో హీరోలు నటించే క్యారెక్టర్స్ కు అనుగుణంగా విగ్గులను ఉపయోగించడం అనేది సాధారణంగా జరుగుతుంది. టాలీవుడ్ లో హీరోలు ఎక్కువ మంది సినిమాలలో విగ్గుతో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

Video Advertisement

హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య నటించే ప్రతి చిత్రంలోనూ  విగ్గును ఉపయోగిస్తారు. బాలకృష్ణ విగ్ గురించి ఆయన పర్సనల్ మేకప్ మెన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ బాలయ్య వాడే విగ్గుల గురించి చాలా విషయాలను తెలిపారు. బాలకృష్ణ గారి కోసం చెన్నైలేదా ముంబై నుండి విగ్గులను తెప్పిస్తామని, ఇప్పుడు హైదరాబాదులో చాలా రకాల విగ్గులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అయితే బాలయ్య వాడే విగ్గులు చాలా ఖరీదు ఉంటాయని అన్నారు. బాలయ్య నాసిరకంగా ఉండే విగ్గులను అసలు వాడరని వెల్లడించారు. అందువల్ల బాలకృష్ణ ఉపయోగించే విగ్గుల కోసం లక్షల్లో ఖర్చు పెడతామని వాసు తెలిపారు.అంతే కాకుండా సినిమా సినిమాకి బాలయ్య నటించే పాత్రను బట్టి, సన్నివేశాలను బట్టి విగ్గులు మార్చాల్సి వస్తుందని కాబట్టి వాటి కోసం అయ్యే ఖర్చును కూడా ప్రొడ్యూసర్స్ భరిస్తారని తెలియచేసారు. కాగా, బాలకృష్ణ చిత్రాలలో విగ్ సెంటిమెంట్ ఉంటుందనే టాక్ కూడా ఉంది. బాలయ్య విగ్గు సెట్ అయితే ఆ మూవీ హిట్ అనే సెంటిమెంట్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి.
ఈ సెంటిమెంట్ గురించి మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ బాలయ్య గారు అలాంటి వాటిని నమ్మరని,  బాలయ్యకు విగ్గు సెట్ అయితే మాత్రం ఆ చిత్రంలో చూడటానికి బాగా కనిపిస్తారని చెప్పారు. అందు వల్లనే  ఆ చిత్రాలు హిట్ అవుతాయనీ వెల్లడించారు. వాసు కొప్పిశెట్టి బాలయ్య విగ్గుల గురించి చెప్పిన ఈ విషయలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Also Read: ఆడ చాణక్యుడిగా పిలవబడిన ఈ “కుందవై” ఎవరు..? ఆమె కథ ఏంటి..?


End of Article

You may also like