ఆడ చాణక్యుడిగా పిలవబడిన ఈ “కుందవై” ఎవరు..? ఆమె కథ ఏంటి..?

ఆడ చాణక్యుడిగా పిలవబడిన ఈ “కుందవై” ఎవరు..? ఆమె కథ ఏంటి..?

by kavitha

Ads

స్టార్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమా తొలి భాగం ‘పీఎస్1’ పేరుతో గాట సంవత్సరం సెప్టెంబర్‌ 30న రిలీజ్ అయ్యి విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళంలో ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది.

Video Advertisement

ఎనిమిదేళ్ళ తర్వాత మణిరత్నంకి ఈ మూవీ రూపంలో భారీ విజయం లభించింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండవ భాగంలో ఏం జరిగిందా అని ఆడియెన్స్  ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఈ సినిమాలో త్రిష నటించిన పాత్ర కుందవై. ఆమె ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
లెజెండరీ దర్శకుడు మణిరత్నం చాలా కాలం తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2’ అనే పీరియాడిక్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్,  త్రిష,  కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీశారు.
గతంలో వెయ్యి ఏళ్ల క్రితం రాచరిక పాలన కాలంలో మహిళలకు స్థానం లేదని హిస్టరీ పాఠాలలో చదువుకున్నాము. కానీ అవి తప్పని నిరూపించే చారిత్రక మహిళా ఉన్నారు. ఆమె కుందవై. పదవ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తున్న సమయంలో రాజు సుందర చోళుడు సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటే, ఆదిత్య కరికాలన్ చోళ సామ్రాజ్య ఖ్యాతిని దక్షణ భారతదేశంలో విస్తరించాడు. తరువాత రాజరాజచోళుడి పాలనలో చోళ ఖ్యాతి ఇండియా దాటి  ఖాంబోడియా వరకు విస్తరించింది. అయితే రాజరాజచోళుడి ఖ్యాతి వెనుక ఒక మహిళా చాణిక్య ఉన్నారు.ఆమె కుందవై. రాజు సుందర చోళుడికి ముగ్గురు పిల్లలు. ఆదిత్య కరికాలన్ , కుందవై, అరుళ్‌మొళి వర్మన్ (రాజరాజచోళ). చోళులకాలంలో మగవారితో సమనంగా ఆడవారు నిర్ణయాలు తీసుకునేవారు. కుందవై తల్లి మహాదేవి కూడా రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఆమె శిక్షణలో కుందవై కూడా శక్తివంతమైన మహిళగా రాజకీయాలు నడిపారు. ఈ నవలను రాసిన రచయిత కాస్తంత కల్పితాన్ని జోడించాడు. వాస్తవంగా ఆదిత్య కరికాలన్ కంటే చాలా చిన్నవాడు అరుళ్‌మొళి, ఆదిత్యుడు మరణించిన తరువాత కుందవై తమ్ముడిని చూసుకుంది.
సంక్షోభ పరిస్థుతులలో ఉన్న సమయంలో రాజ్యాన్ని తన తెలివితేటలతో కాపాడుకున్న పవర్ ఫుల్ మహిళ. రాజకీయాలు, ఆధ్యాత్మిక, సౌందర్యం, ఎదురులేని చాణక్యం అన్ని కలగలసిన అరుదైన వ్యక్తిత్వం కుందవై. రాజరాజచోలుడు చిక్కుల్లో ఉన్న ప్రతిసారీ తల్లిలా ఆదుకుంది. తంజావూరు బృహధీశ్వర ఆలయ నిర్మాణంలో కుందవై పాత్ర కీలకమైనది. అక్కడ గోడలపై చోళుల శిల్పాలతో పాటుగా, కుందవై శిల్పాలు కనిపిస్తాయి.
కుందవై ఇతర రాజ్యాలతో సయోధ్య, యుద్ధ విషయాలలో ఆమె నిర్ణయాలకు ఎదురులేదు. ఆమె తెలివితేటలను సామంత రాజులు ఎంతో గౌరవించేవారు. తమ కుమార్తెలను శిక్షణ కోసం కుందవై దగ్గరకు పంపించేవారు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎనద్రో రాజులు పోటీ పడేవారు. ఆమె రాజరాజచోలుడి మిత్రుడైన వంధ్యదేవున్ని పెళ్లి చేసుకుందని కల్కి రాసిన నవలలో ఉంది. మరి కొన్ని కథనాల ప్రకారం ఆమె వివాహం చేసుకోలేదని తెలుస్తోంది. ఆమె చాలా కాలం పాలయారైలో ఉండేవారు.
ఇప్పటికి అక్కడ ఉండే చాలా కుటుంబాలు ఆమెను ఆడపడుచుగా పూజిస్తారు. కుందవైని నాచియార్ గా పూజిస్తారు. శైవ నాయనర్ల సాహిత్యాన్ని సేకరించి భద్రపరచింది. ఆ సాహిత్యం ఇప్పటికి భద్రంగా ఉందంటే కుందవై కారణం అని అంటారు. రాజరాజచోళుడికి చరిత్రలో ఇంతగొప్ప స్థానం ఉందంటే దాని వెనుక కుందవై కృషి ఎంతో ఉంది. కానీ ఆమె గురించి చరిత్ర పాఠాలలో ఎక్కడ ప్రస్తావించలేదు.
ఆమె ఆధునికంగా ఆలోచించేది. రాజ్యంలో శాంతి ఉండాలంటే అన్ని సంస్కృతులను గౌరవించాలని చెప్పి, ఆచరించింది. అందుకు అనుగుణంగా ఆమె నిర్మించిన శైవ, వైష్ణవ, జైన ఆలయాలను తమిళనాడులో చూడవచ్చు. ఆమె రాజకీయాలలోనే కాకుండా సంగీత, సాహిత్యంలో జ్ఞాని. ఒకప్పుడు పాండ్య, లంక, చాళక్య రాజ్యాల నుండి చోళ రాజ్యానికి ముప్పు ఉండేది. అయితే ఆ మూడు రాజ్యాల పై రాజ రాజ చోళుడు పట్టు సాధించి, ముమ్మడి చోళుడిగా ఖ్యాతి చెందాడు. ఆ ఖ్యాతి వెనుక ఉన్న మహిళా శక్తి కుందవై.

Also Read: “సీనియర్ ఎన్టీఆర్” కంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకున్న… ఈ 2 హీరోయిన్లు ఎవరో తెలుసా..?


End of Article

You may also like