పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది…కానీ నా గతాన్ని చెప్పాలంటే భయంగా ఉంది.! మీరే పరిష్కారం చెప్పండి.! అంటూ ఓ అబ్బాయి మాకు పంపిన మెసేజ్ ఇది. అతని సమస్య చదివి మీ సలహా కామెంట్ చేయండి.

చాలా మంది లైఫ్ లో వచ్చిన స్వేచ్చని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. నేను కూడా అలాంటి వాడినే. సాఫ్ట్ వేర్ ఉద్యోగం, చుట్టూ అమ్మాయిలు, వీకెండ్ పార్టీలు, శాలరీ పేరిట చేతినిండా డబ్బు.. లైఫ్ కి ఇంకేమి కావాలి అనుకున్నా… నా ఇష్టం వచ్చిన వైపు పరుగులు తీస్తూనే ఉన్నా. కానీ, ఓ రోజు ఇంట్లో వాళ్ళ బలవంతం పై పెళ్లి చూపులకు వెళ్ళా.. అక్కడే ఆగిపోయా. కాదు, ఆమె చూపులు నన్ను ఆపేసాయి.

ENGAGEMENT

representative image

తను ఎంత పద్ధతి గా ఉందో. తన మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయా. నేను హైదరాబాద్ లో ఉండి జాబ్ చేస్తున్న రోజుల్లో చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా. కానీ, అందరు మేక్ అప్ అందాలు, ప్లాస్టిక్ నవ్వుల్నీ పులుముకున్నవారే. అందుకే అందరు నా కళ్ళకి నచ్చారేమో కానీ..మనసుని మాత్రం టచ్ చేయలేకపోయారు. కానీ, తను అలా కాదు. అసలు ఏమి మేక్ అప్ వేసుకోకుండా వచ్చి కూర్చుంది. తను నవ్వుతుంటే ఎంత నాచురల్ గా, హాయిగా అనిపించిందో. పెళ్లంటే తననే చేసుకోవాలి అనిపిస్తోంది.

boy dating 2

representative image

తనని చూసినప్పటినుంచి.. నాలో నేను లేను. తనకి, తన ఫామిలీ కి నేను నచ్చడం తో మా ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ అయింది. అయితే, తను చాలా పధ్ధతి గల పిల్ల. ఎంతో సంప్రదాయబద్ధం గా ఉంది. ఆమెకు గతం లో నేను డేటింగ్ చేసినట్లు చెబితే, ఎలా రియాక్ట్ అవుతుందోనని నాకు కొంత భయం గా ఉంది. తన కంటినుంచి ఒక చుక్క కన్నీరు వచ్చినా నేను భరించలేను. తనని అంతలా ప్రేమిస్తున్నాను.

boy dating

representative image

గతం లో చేసిందేదో చేసాను. కానీ, వర్తమానం, భవిష్యత్ అన్ని తనతోనే జరిగిపోవాలనిపిస్తోంది. తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలనిపిస్తోంది. కానీ, నా ఫ్రెండ్స్ గాని, ఇంకెవరైనా గాని నా గతం గురించి తనకు చెప్తారేమోనన్న ఆందోళన నా పై మరింత ఒత్తిడి పెరిగేలా చేస్తోంది. తను లేని భవిష్యత్ ని ఉహించుకోలేను.. కానీ, నా గతాన్ని తనతో పంచుకోలేక సతమతమవుతున్నా. మా మారీడ్ లైఫ్ సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నా. అందుకు నాకేదైనా పరిష్కారం చూపిస్తారని కోరుతున్నా.