Ads
బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం మరియు 1757లో ప్లాసీ యుద్ధంతో, మొఘల్ రాజవంశం క్షీణించి భారతదేశంలో అధికారిక బ్రిటిష్ పాలన ప్రారంభమైంది.
Video Advertisement
ఈస్టిండియా కంపెనీ పాలనలో భారతదేశంలోని వలసరాజ్యాల రోజుల గుర్తుచేసుకున్నప్పుడు, బ్రిటీష్ వారు భారతీయుల పై చేసిన అకృత్యాలు గుర్తుకు వస్తాయి. అయితే ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వారు భారత దేశం కోసం కొన్ని మంచి పనులు కూడా చేశారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. ఇంగ్లీష్ :
ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు పరిపాలన సౌలభ్యం కోసం ఇంగ్లీష్ ను నేర్పింది. ఈ విధంగా బ్రిటిష్ వారి వాల్లే భారతీయ సంస్కృతిలో ఆంగ్ల భాష ప్రవేశించింది. నిజం చెప్పాలంటే, ఆంగ్ల భాష ఇండియాకి అనేక అవకాశాల తలుపులు తెరిచింది. మన జ్ఞానాన్ని, ఆలోచనా విధానాన్ని మెరుగుపరచడంలో ఈ భాష సహాయపడింది.2. ఇండియన్ రైల్వే:
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే సంస్థలలో ఒకటైన ఇండియన్ రైలు వ్యవస్థను బ్రిటిష్ వారు స్థాపించారు. అందువల్ల భారతదేశంలోని చాలా రైల్వే స్టేషన్లు బ్రిటిష్ వాస్తు ప్రకారం నిర్మించబడ్డాయి. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సరుకులను మరియు వారి ఆఫీసర్ల రవాణా కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని ప్రారంభించింది. భారతదేశంలో తొలి రైలు 1853లో ఏప్రిల్ 16న బొంబాయి (ముంబై) నుండి థానే వరకు సుమారు 34 కిలోమీటర్లు ప్రయాణించింది.3. ఇండియన్ ఆర్మీ:
ప్రపంచంలోని నాలుగవ అత్యంత శక్తివంతమైన సైన్యం ఇండియన్ ఆర్మీ. ఇది ప్రారంభించింది కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడింది. భారతీయ సైన్యంలోని సంస్కృతి, పద్ధతులు ఇప్పటికీ ఈస్టిండియా కంపెనీని గుర్తుకు తెస్తున్నాయి.
4. టీకాలు
19వ శతాబ్దపు చివరిలో, 20వ శతాబ్దపు ప్రారంభంలో మశూచి భారతదేశంలో ఒక అంటువ్యాధిగా వ్యాపించింది.బ్రిటిష్ వారు భారతదేశంలో మశూచిని నివారించడం కోసం 1892లో నిర్బంధ టీకా చట్టాన్ని ఆమోదించారు. డిస్పెన్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా వ్యాధికి చెక్ పెట్టడానికి వారు వివిధ ప్రాంతాలలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు శానిటరీ కమిషనర్లను కూడా నియమించారు.
5. జనాభా లెక్కలు
బ్రిటీష్ వారు 1871లో జనాభా గణనను ప్రారంభించారు. 1871 నుండి ప్రతి 10 సంవత్సరాలకు జనాభాను లెక్కించడానికి ఇండియాలో జనాభా గణనను ప్రారంభించారు. జనాభా యొక్క వయస్సు, లింగం, మతం, కులం, విద్య వంటి గణాంక సమాచారాన్ని సేకరించేవారు. 1871 – 2011 వరకు 15 సార్లు జనాభా గణన నిర్వహించబడింది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే 10 రైళ్లు ఇవే..! ఏమేమి ఉన్నాయంటే..?
End of Article