తొలివలపు చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్‌. ఇండస్ట్రీ కి వచ్చి 21 ఏళ్ళు దాటింది. హీరో గా ఎంట్రీ ఇచ్చినా.. ప్రభాస్, మహేష్ బాబు లతో విలన్ గా తలపడి.. చివరికి సక్సెఫుల్ మాస్ హీరోగా మారారు. ముఖ్యంగా వర్షం, జయం, నిజం సినిమాలో ఆయన పండించిన విలనీజం పీక్స్‌ అని చెప్పవచ్చు. గోపిచంద్‌ ప్రముఖ తెలుగు దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. అయితే గత కొంత కాలంగా వరుస ప్లాఫ్‌లు గోపీచంద్‌ను వెంటాడుతున్నాయి.

Video Advertisement

 

 

ఇక చివరిగా రాశీ ఖన్నా, గోపీచంద్‌ కాంబినేషన్‌లో మారుతి దర్శకత్వంలో వచ్చిన పక్కా కమర్షియల్‌ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం గోపీచంద్ శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబీనేషన్‌లో లౌక్యం, లక్ష్యం చిత్రాలు వచ్చి విజయం సాధించాయి. దీంతో వీరిద్దరిది హిట్ కాంబినేషన్ గా మారింది. దీనికి నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ చిత్రానికి ‘రామ బాణం’ అనే టైటిల్ కంఫర్మ్ చేసారు మేకర్స్.

gopichand movies business strategy..!!

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన సినిమాలకు బిజినెస్ పరంగా సాలిడ్ రేట్స్ సొంతం అవ్వడం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఆయన సినిమాలకు బాక్స్ ఆఫీస్ వైజ్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ ఎప్పుడూ బాగానే సొంతం అవుతూ ఉండటంతో తనతో సినిమాల బడ్జెట్ కూడా కొంచం ఎక్కువ అయినా కానీ నిర్మాతలు సినిమాలను భారీగానే రూపొందిస్తూ వస్తున్నారు.

gopichand movies business strategy..!!

అప్పుడెప్పుడో 2014 టైం లో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న గోపీచంద్ తర్వాత క్లీన్ హిట్ కి దూరం అయిపోయాడు.ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ క్లీన్ హిట్ వేట కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఆశలన్నీ కూడా గోపీచంద్ అప్ కమింగ్ మూవీ డైరెక్టర్ అయిన శ్రీవాస్ పైనే పెట్టుకున్నాడు గోపీచంద్. దానికి తగ్గట్టే కానీ అతడి అప్ కమింగ్ మూవీ ‘రామ బాణం’ ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదరగొడుతున్నాడు గోపీచంద్.

gopichand movies business strategy..!!

ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ సొంతం అవుతున్నాయని తెలుస్తుంది. ఈ రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ హిట్స్ లేక పోయినా సొంతం చేసుకుంటున్న గోపీచంద్ ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంబ్యాక్ సొంతం చేసుకుంటాడని ఆయన ఫాన్స్ ఆశిస్తున్నారు.