Ads
ప్రస్తుతం సినిమా కన్నా టీవీ సీరియల్ హవా ఎక్కువ నడుస్తుంది అని చెప్పొచ్చు. తనకు నచ్చిన సీరియల్ స్టార్ట్ అయ్యే టైంకి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి టీవీ ముందు కూర్చుంటున్నారు ప్రేక్షకులు. చాలామంది అయితే ఆ సీరియల్ లో కుటుంబం తమ కుటుంబమే అన్నట్లు ఆ సీరియల్ లోని నటీనటులకు వచ్చిన కష్టాలు తమ కుటుంబ సభ్యులకే వచ్చినట్లు ఫీల్ అయి బాధపడుతున్నారు.
Video Advertisement
ఇక ఈ సీరియల్స్ లో నటించే నటీనటులకు ఫాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగింది. ఈమధ్య సీరియల్ యాక్టర్స్ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవుతున్నారు. ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ రీసెంట్ గా అమరదీప్ , తేజస్విని లు ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.
Tv actors Nikhil Maliyakkal & Kavya shree photos
ఇప్పుడు కొత్తగా మరొక సీరియల్ జంట ప్రేమలో ఉన్నట్టు తెలిసింది…. ఆ జంట మరెవరో కాదు…. స్టార్ మా గోరింటాకు సీరియల్ నటీనటులైన కావ్య శ్రీ, నిఖిల్ లు.
ఈమధ్య ఈటీవీలో జరిగిన ఒక షోలో మల్లెమాల ఈ జంటకు ఆన్ స్టేజి కళ్యాణం చేసి మురిసిపోయింది.
Also Read: “తాగి ట్వీట్ చేసావా బ్రో..?” అనే నెటిజన్ ప్రశ్నకి… వైరల్ అవుతున్న రాహుల్ రామకృష్ణ రిప్లై..!
Tv actors Nikhil Maliyakkal & Kavya shree photos
రీసెంట్ గా యూట్యూబ్ లోని ఒక ఛానల్ కు సంబందించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ మధ్య ఎప్పుడు చిలిపి తగాదాలు ఉంటాయని ,కానీ అంతకు మించిన ప్రేమ కూడా ఉందని పేర్కొన్నారు.
కావ్య ధైర్యంగా లైవ్ లోనే నిఖిల్ కు ప్రపోజ్ చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. నువ్వు ప్రపోజ్ చేసినపుడు నేను కూడా తిరిగి చేయాలి కదా అని నిఖిల్ చిలిపిగా తనకు తిరిగి ప్రపోజ్ చేసాడు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ జంట త్వరలోనే ఒకటి కావాలని అభిమానుల ఆకాంక్ష.
Also Read: అసలు భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి..? చిరాకుపడుతున్న ఓ భర్త కి ఓ ముసలి జంట ఏ పాఠం నేర్పిందంటే..?
End of Article