అసలు భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి..? చిరాకుపడుతున్న ఓ భర్త కి ఓ ముసలి జంట ఏ పాఠం నేర్పిందంటే..?

అసలు భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి..? చిరాకుపడుతున్న ఓ భర్త కి ఓ ముసలి జంట ఏ పాఠం నేర్పిందంటే..?

by Anudeep

సాధారణంగా చిన్న చిన్న విషయాలు కూడా భార్య భర్తల మధ్య గొడవలకు కారణం అవుతూ ఉంటాయి. భర్తలు ఆఫీస్ లో పని ఒత్తిడి తో అలసిపోతూ ఉంటారు. అలాగే, ఇంటి పనుల్లోనూ, కుటుంబ బాధ్యతల్లోనూ భార్యలు కూడా అలసిపోతూ ఉంటారు. భార్య చేసే పనికి ఏ జీతము ఉండదు కాబట్టి చాలా మంది దానిని గుర్తించరు. ఇక్కడే భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. తమను గుర్తించడం లేదంటూ ఇద్దరు బాధపడుతూ ఉంటారు.

Video Advertisement

ఈ క్రమం లోనే ఓ భార్య భర్త ఆఫీసు కు వెళ్లిపోయిన తరువాత ఒంటరి గా ఫీల్ అవుతూ బాధపడేది. ఆమె నెట్ లో చుసిన భార్య, భర్తల మధ్య అన్యోన్యం తాలూకు వీడియో లను చూసి మరింత ఎక్కువ గా ఫీల్ అయ్యేది.

wife and husband

ఆమె ఈ వీడియో లను చూడడం మాత్రమే కాకుండా.. వాటిని తన భర్తకు కూడా పంపేది. ఆఫీస్ వర్క్ లో బిజీ గా ఉన్న ఆ భర్త కు భార్య పెట్టె మెసేజ్ లు చూస్తే విసుగు వచ్చేది. ఈమెకేమి పని లేదు.. అస్తమానం ఇలాంటి వీడియో లు పెడుతూ ఉంటుంది అని అనుకునేవాడు. ఓ సారి విసుగొచ్చి.. తన భార్యను అడుగగా.. మీరు నన్నెప్పుడైనా అలా ప్రేమ గా చూసుకున్నారా అంటూ అడిగింది.

wife and husband 1

దానికి సమాధానం గా ఆ భర్త, ఇలా నిజ జీవితం లో ఉండడం కుదరదు.. వాళ్ళు వీడియో లో ఎదో అలా కనబడినంత మాత్రాన నువ్వు నన్ను ఇలా వేధించడం ఏమి బాగోలేదు అంటూ విసుక్కున్నాడు. దీనితో, ఆ భార్య మరింత ఫీల్ అయింది. మీరెప్పుడు ఇంతే.. అంటూ అలిగి మాట్లాడడం మానేసింది. మరుసటి రోజు కూడా ఇదే తంతు కొనసాగడం తో.. ఆ భర్త ఆఫీస్ లో డల్ గా ఉన్నాడు. ఏమి జరిగింది అంటూ అతని స్నేహితుడు అడిగితె.. జరిగిందంతా చెప్పాడు.. ఈ ఆడవాళ్ళూ ఇంతే. ఏవో వీడియో లు చూసి అందరు అలా ఉంటారని అనుకుంటారు. కానీ, వాళ్ళేమైనా అలా ఉంటారా ఏమిటి..? అంటూ ధ్యాస మార్చే ప్రయత్నం చేసాడు.

wife and husband 2

సదరు భర్త అది విన్నాకా, నిజమే కదా.. వాళ్ళేమి అలా ఉండరు.. అది తన భార్య కు తెలిసేలా చేయాలి అని అనుకున్నాడు. మరుసటి రోజు బయటకు తీసుకెళ్తా అంటూ రెడీ గా ఉండమన్నాడు. ఆమె ఎక్కడ లేని హుషారు తో రెడీ అయింది. ఆ భర్త ఆమె ను తీసుకుని అలా వీడియోలలో నటించిన తనకు తెలిసిన వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లాడు. వీళ్ళు వెళ్లేసరికి వారిద్దరూ కొట్టుకుంటూ కనిపించారు. మరొకరి దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు కూడా పోట్లాడుకుంటూ కనిపించారు. దాదాపు అందరు ఇలానే ఉన్నారు. అతని భార్య కు విసుగు వచ్చేసింది. ఎందుకు ఇలా ఇక్కడకు తీసుకొస్తున్నారు. నాకు చిరాకు వచ్చేస్తోంది అని చెప్పింది.

Also Read:   ఆ ఎన్టీఆర్ సినిమాకి…హలో బ్రదర్ సినిమాకి మధ్య ఉన్న లింక్ ఏంటో మీకు తెలుసా.?

wife and husband 3

అప్పుడు దగ్గర్లోని పార్క్ కు తీసుకెళ్లి.. ఆ భర్త ఇలా చెప్పాడు. నువ్వు వీడియో లలో ఎవరిని చూసి మురిసిపోయావో.. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసావు కదా.. ఎవరికైనా ఆ వీడియోలలో చూపించినట్లు నిజజీవితం లో ఉండడం సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతలో వారి ఎదురుకుండా ఓ వృద్ధ జంట వచ్చి కూర్చుంది. వారిద్దరూ ఎంతో ఉల్లాసం గా ఉన్నారు. ఆ ముసలి భార్య చిన్న పిల్లలా ఆడుతుంటే.. ఆ ముసలి భర్త కూడా చిన్నపిల్లాడి లా ఆమె చుట్టూ పరిగెడుతున్నాడు. అది చుసిన ఆమె భార్య మళ్ళీ మొదటికి వచ్చింది. చూసారా వారిద్దరూ ఎంత అన్యోన్యం గా ఉన్నారో.. అంటూ చూపించింది. ఇక ఆ భర్త కు బాగా కోపం వచ్చి.. అక్కడ నుంచి లేచి ఆ వృద్ధ జంట వద్దకు వెళ్ళాడు.

wife and husband 4

“నీకొక్కడికే భార్య ఉందని అనుకుంటున్నావా.. అందరు చూసి మీరు బాగా ప్రేమ గా ఉన్నారని అనుకోవడానికేనా ఇలా పార్కుల్లో ఇలా చేస్తున్నారు” అంటూ చిరాకుపడ్డాడు. అది విన్న భార్య, భర్తని మందలించింది. అంత పెద్ద వారిని పట్టుకుని ఇలానేనా మాట్లాడేది అంటూ మందలించింది. దానికి ఆ వృద్ధుడు నవ్వాడు. “బాబు.. నా భార్య కు పిచ్చి పట్టింది. అందుకే ఆమె అలా ఆడుతోంది. ఆమె కు పిచ్చి పట్టడానికి కారణం నా కొడుకు. నా భార్య కు చేయించని వైద్యం లేదు.. ఆమెను మామూలు జనం లోకి తీసుకొచ్చి.. ఆమెను సంతోషం గా చూస్తే.. తిరిగి మామూలుది అవుతుంది. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. గత నలభై ఏళ్లుగా అది నన్నే నమ్ముకుని, నేనే లోకం గా నాతొ కాపురం చేసింది. నా కష్ట సుఖాలను పంచుకుంది.. ఇప్పుడు దాన్ని వదిలేసి నేను బతకలేను.. ఎవరేమి అనుకున్నా నేను ఇలానే ఉంటాను” అంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఆ భర్త ఆలోచనలో పడ్డాడు. ఆ భార్య కూడా ఇకపై తన భర్తను పదే పదే విసిగించకుండా అతని కష్టాన్ని కూడా పంచుకోవాలని అనుకుంది. ప్రస్తుతం వారిద్దరి మధ్య మౌనమే మిగిలివుంది. ఒకరిని ఒకరు మరింత గా అర్ధం చేసుకోవాలని వారిద్దరూ అనుకుంటున్నారు..

Also Read:  జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి.? అవి ఎందుకు తక్కువ ధరకే అమ్ముతారు…?


You may also like