గతం లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రాణించిన వారు ఎందరో ప్రస్తుతం సినిమాల్లో నటీనటులుగా రాణిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ కి ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం లో చెల్లెలిగా నటించింది అయేషా కాదుస్కర్. ఏమోషనల్ సన్నివేశాల్లో కూడా ఈ అమ్మాయి అద్భుతంగా నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఆమె ఇప్పుడు పలు సినిమాలు, సీరియల్స్ లో నటిస్తున్నారు. ఆమె ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Video Advertisement

చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే సినిమా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది.

did you remember this child artist..??

ఈ చిత్రం లో చరణ్ కి చెల్లిగా అయేషా కాదుస్కర్ నటించింది. ఈమెది ముంబై. ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలు పాత్రలో నటించిన నటి తన నటనతో మెప్పించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈమె గోవిందుడు అందరివాడేలే చిత్రం తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. హిందీ సీరియల్స్ లో కూడా ఆమె నటించింది. తాజాగా ఈమె ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘డాక్టర్ జీ’ చిత్రం లో నాటింది అయేషా.

did you remember this child artist..??

సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే అయేషా కి ఇన్ స్టాగ్రామ్ లో 2,56,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఈ బ్యూటీ చాలా మారిపోయారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అయేషా టాలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వాలని మరి కొందరు చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.