బుద్ధుడి గొప్పతనం అందరికీ తెలుసు.. కానీ అతని భార్య గొప్పతనం మీకు తెలుసా.?

బుద్ధుడి గొప్పతనం అందరికీ తెలుసు.. కానీ అతని భార్య గొప్పతనం మీకు తెలుసా.?

by Megha Varna

Ads

గౌతమ బుద్ధుడు గురించి తెలియని వాళ్లు ఉండరు. బౌద్ధ ధర్మానికి మూలకారకుడయిన గౌతమబుద్ధుడు నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. బుద్ధుడు అసలు పేరు సిద్దార్థుడు. సిద్ధార్ధుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది. కానీ అప్పట్లో ఇది భారత దేశం లోకి వస్తుంది. అయితే బుద్ధుడు గొప్పతనం గురించి మనందరికీ ఎన్నో విషయాలు తెలుసు.

Video Advertisement

కానీ అయిన భార్య అయిన యశోధర గురించి చాలా మందికి తెలియదు. నిజానికి ఆమె తన భర్త కంటే కూడా గొప్పది. బుద్ధుడు జ్ఞానాన్ని సంపాదించడం కోసం భార్యా, బిడ్డని వదిలి వెళ్ళిపోతాడు. కొండలు, అడవులు, ఆశ్రమాలు ఇవన్నీ వెతుక్కుని భార్య, బిడ్డని అలా వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే కొంతకాలం తర్వాత బుద్ధుడు భార్య, బిడ్డని చూడడానికి వస్తాడు.

అప్పుడు భార్య ఇలా అడుగుతుంది. ”నన్ను వదిలి వెళ్ళిపోయారు కదా ఒక్కసారి వెళ్లినప్పుడు నాకు చెప్పచ్చు కదా” అని… అలానే మీ ఆలోచనకి నేను ఏ మాత్రం అడ్డు చెప్పను కదా అని అంటుంది. అప్పుడు బుద్ధుడు భార్యని క్షమించమని అడుగుతాడు. ఆ తర్వాత నీకు భయపడి కాదు నాకు భయపడి నేను చెప్పలేదు అని సమాధానమిస్తాడు బుద్ధుడు.

నీకు చెప్పడానికి వచ్చినప్పుడు నా మనసు ఎక్కడ మారిపోతుందో అని చెప్పకుండా వెళ్ళిపోయాను అని బదులిస్తాడు. ఆ తర్వాత తన భార్య మళ్లీ ప్రశ్నిస్తుంది ఎందుకు మీరు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లడం..? ఇంత జ్ఞానాన్ని మీరు ఇక్కడ ఉండి కూడా సంపాదించ వచ్చు కదా..? అని అడుగుతుంది. అప్పుడు బుద్ధుడు అవును నిజమే కానీ అప్పుడు నాకు ఈ విషయం తెలియలేదు అని ఆమెతో చెప్తాడు. అయితే నిజానికి అందరూ బుద్ధుడి గురించి ఎంతగానో చెప్పుకుంటూ ఉంటారు. కానీ తన భార్య గురించి, ఆమె గొప్పతనాన్ని గురించి ఎవరూ చెప్పుకోరు.

భర్త వెళ్లిపోయాడు అంటే అతన్ని ఎవరూ ఏమీ అనరు. అదే భార్య ఎక్కడికైనా వెళ్ళిపోయింది అంటే ఈ లోకమంతా కూడా ఆమెను వేలెత్తి చూపిస్తుంది. ఎన్నో మాటలు అంటుంది. అయితే బుద్ధుడు వెళ్ళిపోయినప్పుడు కూడా తన భార్య ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. ఇంకా ఆమె అందంగా ఉంది కదా..?, పెద్ద వయసు ఏమీ రాలేదు కదా..? ఇంత రాజ్యం ఆమె సొంతం అయింది కదా..? ఆవిడకి నచ్చినట్టు ఉండొచ్చు కదా..? ఇలా ఎన్నో నిందలు వేశారు.

పైగా పసిపిల్లవాడు అమ్మా నాన్న ఎక్కడున్నారు అంటే ఏమని చెప్పాలో ఆమెకి అర్థం కాలేదు. అన్నీ ఉండి కూడా ఆమె ఎంతో దుఃఖాన్ని భరించాల్సి వచ్చింది. ఎవరు సన్యాసం తీసుకున్నారు నిజానికి..? బుద్ధుడా..?, అతని భార్యా..? మీరేమంటారు..?


End of Article

You may also like