తమిళ హీరో విశాల్ ప్రస్తుతం ‘మార్క్ ఆంటోనీ’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మార్క్‌ ఆంటోని సినిమాకు అదిక్ ర‌విచంద్రన్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన విశాల్‌ లుక్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేసింది. విశాల్‌కు జోడీగా రీతూవ‌ర్మ న‌టిస్తుంది.

Video Advertisement

 

మినీ స్టూడీయోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎస్. వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త‌మిళంతో పాటు, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మేక‌ర్స్ రూపొందించ‌నున్నారు. అయితే ఈ మూవీ లో నటిస్తున్న ఒక్కొక్క నటుడికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఒక్కక్కటి రివీల్ చేస్తున్నారు మేకర్స్.

guess this hero cum director..!!

తాజాగా ఈ చిత్రం నుంచి ఇంకొక నటుడి పోస్టర్ రిలీజ్ అయ్యింది. అది నటుడు, దర్శకుడు అయిన ఎస్ జె సూర్య ఫస్ట్ లుక్. ఆ పోస్టర్ చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎస్ జే సూర్య ఆతర్వాత నటుడిగా మారి సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు.

guess this hero cum director..!!

ఇప్పుడు మార్క్ ఆంటోనీ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు ఎస్ జె సూర్య. ఇప్పుడు ఆ పోస్టర్ లో ఎస్ జె సూర్య గుర్తుపట్టలేకుండా ఉన్నాడంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మార్క్ ఆంటోనీ మూవీ లో ఎస్ జె సూర్య తో పాటు, దర్శకుడు సెల్వ రాఘవన్, సునీల్ వర్మ , అభినయ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

guess this hero cum director..!!

ఈ మూవీ కి జీవీ ప్రకాశ్‌ కుమార్ అందించిన అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు మెయిన్‌ హైలెట్‌గా నిలువబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్‌ చెబుతున్నాయి. మోషన్‌ పోస్టర్‌ ద్వారా సునీల్‌, ఎజేసూర్య, సెల్వ రాఘవన్‌ పాత్రలను పరిచయం చేసి.. సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాడు అధిక్ రవిచంద్రన్‌.