ఇక్కడ అగర్బత్తీలు వెలిగిస్తారు… తలనీలాలు కూడా సమర్పిస్తారు..! ఈ చర్చి ఎక్కడ ఉందో తెలుసా..?

ఇక్కడ అగర్బత్తీలు వెలిగిస్తారు… తలనీలాలు కూడా సమర్పిస్తారు..! ఈ చర్చి ఎక్కడ ఉందో తెలుసా..?

by Mounika Singaluri

Ads

భారతదేశం మత సామ్రాస్యానికి ప్రతీక హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు సోదర భావంతో మెలుగుతూ ఉంటారు. అయితే మన భారతదేశంలో తమిళనాడులో ఉన్న వేళంకని మాత చర్చ్ తర్వాత అంతటి ప్రసిద్ధి ఉన్న చర్చ్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వద్ద గుణదల చర్చ్.

Video Advertisement

ఇంకా చెప్పాలంటే, ఎవ‌రి విశ్వాసాల‌కు అనుగుణంగా వారు పూజ‌లు నిర్వహించుకోవ‌టం ఇక్కడ ప్రత్యేక‌త‌గా చెబుతుంటారు. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో క్రైస్తవులు గుణ‌ద‌ల‌లోని మేరిమాత ఆల‌యానికి త‌ర‌లి వ‌స్తారు. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద క్షేత్రం విజ‌య‌వాడ న‌గ‌రంలోని గుణదల మేరీమాత చ‌ర్చి.

gunadala mary mata churchఫ్రాన్స్‌లోని లూర్థు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత విగ్రహం త‌రహాలోనే ఇక్కడ కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉండడం వల్ల ఈ క్షేత్రం బాగా ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ మేరిమాత ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు త‌ర‌లివ‌స్తుంటారు.

gunadala mary mata church

ఫ్రాన్సులో ఉన్న లూర్థు నగరంలో ఉన్న కొండ అడవిలో సోబిరస్‌ అనే 14 ఏళ్ల బాలిక వంట కోసం కలప ఏరుకునేందుకు వెళ్లగా అక్కడ మేరీ మాతను పోలి ఉన్న ఒక మ‌హిళ కనిపించి ఆమెతో మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11… ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించిడం తో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. దీంతో ఇక్కడ‌ గుణదలలో కూడా అదే ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

gunadala mary mata church

గుణ‌ద‌ల కొండ అన‌గానే అంద‌రికి మేరిమాత పేరు గుర్తుకు వ‌స్తుంది. కానీ ఇక్కడ మత సామరస్యం ఉంటుంది.ఇక్కడ ఎవ‌రి విశ్వాసాల‌కు అనుగుణంగా వారు ప్రార్థన‌లు చేసుకోవ‌చ్చు. కొండ‌కు వ‌చ్చే భ‌క్తులు ఏ మ‌తానికి చెందిన వారైనా వారి మ‌తాల‌కు అనుగుణంగా ప్రార్థన‌లు చేసుకునే వీలుంటుంది. భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌టం, అగ‌ర్బత్తీలు, కొవ్వొత్తులు వెలిగించి పూజ‌లు చేసుకోటం, వాహ‌నాలకు పూజ‌లు చేసుకోవ‌టం ఇలా ఎవ‌రి విశ్వాసాల‌కు అనుగణంగా వాళ్లు ప్రార్థనలు చేసుకొని స్వస్థత చేకూర్చుకుంటార‌ని మ‌త పెద్దలు చెబుతున్నారు


End of Article

You may also like