కామెడీ పండించాలి అంటే ఒక వ్యక్తిలోని లోపాన్ని ఎత్తిచూపాలి అనే అభిప్రాయంతో ముందుకి నడుస్తున్నాయి ప్రస్తుతం కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్. కానీ సింపుల్ గా కామెడీ పండించచ్చు..అందరిని నవ్వించచ్చు అని ప్రూవ్ చేసిన సీరియల్ “అమృతం”. అమృత విలాస్ లో ఎన్ని సార్లు భోజనం చేసిన బోర్ కొట్టదు అనేది ఎంత వరకు వాస్తవమో తెలియదు కాని…అమృతం సింగల్ ఎపిసోడ్ ని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు అనడంలో మాత్రం అతిశయోక్తి ఏం లేదు.

Video Advertisement

అమృతం రావు అమాయకత్వం, ఆంజనేయులు ఐడీయాలు, అప్పాజీ పెనాల్టీలు, సర్వం అరవ గోలలు. క్యారెక్టర్ కి తగ్గట్టుగా కామెడీ ఉంటుంది కానీ…ఈ సీన్ లో కామెడీ రావాలి అని రాదు. అందుకే ఆ సీరియల్ కి చిన్న పెద్దా తేడా లేకుండా ఫాన్స్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అమృతం సీజన్ 2 ఈ ఉగాదికి మన ముందుకు రానుంది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కానీ గుండు హనుమంతు రావు గారి అభిమానులు మాత్రం అంజి పాత్రలో ఆయనను బాగా మిస్ అవుతున్నారు.

ఇప్పుడు అంజి పాత్రలో ఎల్.బి శ్రీరామ్ గారు కూడా అదే రీతిలో ఆకట్టుకుంటారని ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చిన సీసన్ 2 ప్రోమో చూడగానే మొదటి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అమృతం అభిమానులు. అయితే గతంలో ఒకసారి గుండు హనుమంత రావు గారు అమృతం ద్వితీయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అది మీరే చూడండి!

watch video: