సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా మొదటి పాట ఇటీవల విడుదల అయ్యింది. సినిమా టైటిల్ విడుదల చేస్తూ రిలీజ్ చేసిన ఒక చిన్న వీడియో బైట్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Video Advertisement

మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. అతడు సినిమాలో త్రివిక్రమ్ ఒక రకమైన మహేష్ బాబుని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఖలేజా సినిమాలో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపించారు.

guntur kaaram fan theories

ఇప్పుడు ఈ సినిమాలో కూడా మహేష్ బాబు డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమా మొదటి పాటలో కొన్ని వీడియో బైట్స్ కూడా చూపించారు. ఇది చూస్తూ ఉంటే కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అవి ఏంటంటే, ఈ సినిమాలో ఈశ్వరి రావు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మొదటి పాట వీడియోలో ఈశ్వరి రావు కనిపించారు.

guntur kaaram fan theories

ఈశ్వరి రావు గెటప్ చూస్తూ ఉంటే అరవింద సమేత వీర రాఘవ గెటప్ గుర్తొస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో జగపతిబాబు కూడా ఉన్నారు. జగపతిబాబు కూడా ఫుల్ మాస్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో జగపతిబాబు కనిపించారు. ఇది మాత్రమే కాకుండా ఈ సినిమాలో రాజకీయానికి సంబంధించి కొన్ని అంశాలు కూడా ఉన్నట్టు తెలిసింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు.

guntur kaaram fan theories

దానికి సంబంధించి ఒక పిక్చర్ కూడా లీక్ అయ్యింది. ఈ ఫోటోలో ప్రకాష్ రాజ్ పోస్టర్ ఒకటి ఉంది.  అందులో, “జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవనీయులైన, శ్రీ వైర వెంకట స్వామి గారికి” అని రాసి ఉంది. చేతిలో ఒక కాగడా పట్టుకున్నట్టుగా ఆ పార్టీ గుర్తు ఉంది. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా శుభలేఖ సుధాకర్ పార్టీ పేరు జనసత్తా అని ఉంటుంది. దాని గుర్తు కూడా ఒక జ్యోతి గుర్తు ఉంటుంది. దాదాపు రెండు పార్టీ గుర్తులు ఒకటే లాగా ఉన్నాయి.

guntur kaaram fan theories

అంతే కాకుండా ఈ సినిమాలో హీరో పేరు వైర వెంకట రమణా రెడ్డి అనే వార్త వచ్చింది. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా హీరో పేరు వీర రాఘవ రెడ్డి. దాంతో ఈ రెండు సినిమాలకి ఏమైనా లింక్ పెడుతున్నారా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బహుశా త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఏమో. ఎందుకంటే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమాలో కూడా ముందు తనే హీరోయిన్ గా అనుకున్నారు.

pooja-hegde-guntur-karam

కొన్నాళ్లు షూటింగ్ అయిన తర్వాత పూజా హెగ్డే సినిమా నుండి తప్పుకున్నారు. రెండు సినిమాలకి లింక్ ఉంది ఏమో. అందుకనే పూజ క్యారెక్టర్ ఈ సినిమాలో పెట్టాలి అని అనుకోలేదు ఏమో అని అంటున్నారు. ఇటీవల వచ్చిన గుంటూరు కారం పాటలో కూడా హీరో ఒక లీడర్ అని ఒక చిన్న లైన్ ఉంది. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ మాత్రమే. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే అంతవరకు ఆగాల్సిందే.

ALSO READ : “ఈ సీన్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది..?” అంటూ… “జవాన్” మూవీ మీద కామెంట్స్..!