“ఈ సీన్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది..?” అంటూ… “జవాన్” మూవీ మీద కామెంట్స్..!

“ఈ సీన్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది..?” అంటూ… “జవాన్” మూవీ మీద కామెంట్స్..!

by Mounika Singaluri

Ads

సినిమా అనేది ఒక ఫిక్షన్ వరల్డ్. ఇందులో నిజ జీవితానికి సంబంధం లేకుండా లార్జర్ దెన్ లైఫ్ కింద ఏదైనా చేయొచ్చు. ఒక్కోసారి సినిమాలో సీన్స్ చూసి అబ్బ భలే ఉన్నాయి రా అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో సీన్స్ అయితే మరీ కామెడీగా నువ్వు తెప్పిస్తాయి. చెయ్యొచ్చు కానీ బాసు మరీ ఇంతలా చేయకూడదు అంటూ కామెంట్లు చేస్తారు. ముఖ్యంగా లాజిక్ లేని సీన్లు మన బోయపాటి సినిమాలో చూస్తూ ఉంటాం.

Video Advertisement

కమర్షియల్ సినిమా అంటే చాలు లాజిక్కులు పట్టించుకోనవసరం లేదు అని బోయపాటి ఫిక్స్ అయిపోతాడు. సౌత్ లో చాలామంది డైరెక్టర్ లు కమర్షియల్ ఫార్మాట్ కి ఫిక్స్ అయిపోయి లాజిక్కులను పక్కనపెట్టి కొన్ని సీన్లు తీస్తూ ఉంటారు. సినిమా కథనం బాగుంటే ఆ సీను నప్పుతుంది. హీరో ఎంత ఓవరాక్షన్ చేసినా చూడాలి అనిపిస్తుంది. కానీ ఈ సీన్ చూస్తే మట్టుకు మీరు ఏంటి బాస్ ఆడియన్స్ పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా అనక మానరు…

ఇంత చెబుతున్నారు… ఆ సీన్ ఏ సినిమాలోది అనుకుంటున్నారా… రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ జవాన్ సినిమాలోది. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరో కాదు మన తమిళ డైరెక్టర్ అట్లీ. ఈ సినిమా చూసిన తర్వాత వచ్చిన టాక్ ఏంటంటే… నాలుగైదు సౌత్ సినిమాలను మిక్సీలో వేసి జవాన్ సినిమా తీశాడు అట్లీ అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు జవాన్ సినిమా ఓటిటిలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ కొన్ని సీన్లను ఇంటర్నెట్ లో షేర్ చేసి నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏ సీన్ అనుకుంటున్నారా…

jawan

పెద్ద షారుఖ్ ఖాన్ బండిమీద వెళుతూ రోడ్డు మీద తన కాలునీ పెడితే నిప్పులు పుట్టి ఆ నిప్పులకు షారుక్ ఖాన్ నోటిలో ఉన్న సిగరెట్ అంటుకుంటుంది. అక్కడి వరకు బానే ఉంది అక్కడ నుండి షారుక్ డ్రైవ్ చేస్తున్న బండి పెట్రోల్ ట్యాంక్ మూత తీసేసి అందులో సిగరెట్ పడేస్తాడు. దెబ్బకి బండి బ్లాస్ట్ అయ్యి అతనిని ఫాలో చేస్తున్న ఆఫీసర్ల కార్లను బ్లాస్ట్ చేస్తుంది. ఇదంతా చిన్న షారుక్ ఖాన్ చూసి షాక్ అయిపోతాడు. షారుక్ ఖాన్ ఏం కర్మ ఆ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ షాక్ అయిపోయారు. కాలు నుండి నిప్పులు పుట్టడమే గొప్ప అనుకుంటే ఆ నిప్పులకు బండి అంటుకుపోవడం కూడా మరి వింతగా ఉంది అంటూ నవ్వుకున్నారు.

Watch Video:

https://www.instagram.com/reel/CzV07ocLksT/?igshid=NjZiM2M3MzIxNA==

 

Also Read:మహేష్ బాబు “గుంటూరు కారం” ఫస్ట్ సాంగ్ పై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!


End of Article

You may also like