సక్సెస్ అయిన వారు…ఆఫీస్ లో చివరి 10 నిమిషాల్లో చేసే 9 పనులు ఏంటో తెలుసా.?

సక్సెస్ అయిన వారు…ఆఫీస్ లో చివరి 10 నిమిషాల్లో చేసే 9 పనులు ఏంటో తెలుసా.?

by Mohana Priya

Ads

ఏదైనా ఒక వ్యక్తి తన జీవితంలో తను అనుకున్నది సాధించాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటి అనే ప్రశ్నకి చాలా మంది నుండి వచ్చే సమాధానం హార్డ్ వర్క్. నిజమే. ఒక మనిషి తన లక్ష్యాన్ని అందుకోవాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది హార్డ్ వర్క్. కానీ ఒక మనిషి జీవితంలోని తన అలవాట్లు కూడా తన భవిష్యత్తుపై ఎంతో ప్రభావితం చేస్తాయి.

Video Advertisement

habits of successful people

ఒక మనిషికి ఉండే అలవాట్లని బట్టి వాళ్ళు భవిష్యత్తులో సక్సెస్ అవ్వగలరా లేదా అనే విషయంపై ఒక ఐడియా వస్తుంది. అలా సక్సెస్ ఫుల్ వ్యక్తులు చేసే కొన్ని పనుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక రోజు ఆఫీస్ గంటలు చివరికి వచ్చేటప్పటికి మనలో చాలా మంది వెళ్ళటానికి రెడీ అవ్వడం చేస్తూ ఉంటాం. కానీ సక్సెస్ ఫుల్ మనుషులు మాత్రం ఆ రోజు ఆఫీస్ హవర్స్ అయిపోయే 10 నిమిషాల ముందు ఏం చేస్తారంటే.

habits of successful people

#1 తమ డెస్క్ ని సర్దుకుంటారు.

habits of successful people

#2 ఆ రోజు ఎన్ని పనులు చేసాము అనే విషయాన్ని నోట్ చేసుకుంటారు. అంతే కాకుండా చేయాల్సిన పనుల గురించి కూడా లిస్టు రాసుకుంటారు.

habits of successful people

#3 ఆఫీసులో ఉన్నప్పుడు ఏదైనా కాల్ వస్తే అది ఆన్సర్ చేయలేకపోతే ఈ 10 నిమిషాల్లో ఫోన్ చేసి మాట్లాడి విషయం కనుక్కుంటారు.

habits of succesful people

#4 ఆ రోజు వారు ఎవరితోనైనా మాట్లాడి సారీ లేదా థాంక్యూ వంటివి చెప్పాల్సి ఉంటే చెప్తారు.

habits of successful people

#5 నెక్స్ట్ డే ఏమేమి పనులు చేయాలి అనే విషయంపై కూడా పూర్తిగా షెడ్యూల్ రాసుకుంటారు.

habits of successful people

#6 ఆ రోజు ఒక వేళ డబ్బులు ఖర్చు అయితే ఎన్ని ఖర్చయ్యాయి అనే విషయం కూడా నోట్ చేసుకుంటారు.

habits of successful people

#7 ఆ రోజు మర్చిపోయిన పనులు ఏమైనా ఉన్నాయేమో అని గుర్తు తెచ్చుకుంటారు. ఒకవేళ ఏదైనా మర్చిపోతే అవి ఎప్పుడు చేయాలో షెడ్యూల్ కి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు.

habits of successful people

#8 అలాగే ఒకవేళ చిన్న చిన్న పనులు ఏమైనా మిగిలిపోయినా కూడా పూర్తి చేస్తారు.

habits of successful people

#9 ఒకవేళ ఆరోజు ఏమైనా తప్పులు జరిగితే అవి కూడా నోట్ చేసుకొని అవి మరొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు.

 


End of Article

You may also like