Ads
సాధారణంగా మనం గమనించినట్లైతే కొందరికి కాలి బొటన వేలు దగ్గర వెంట్రుకలు ఉంటాయి. మీకు కూడా కాలి బొటనవేలుకి వెంట్రుకలు ఉన్నాయా…? ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే దీనికి గుండె ఆరోగ్యానికి సంబంధం ఉంది. అదేంటి ఈ రెండిటికి మధ్య సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా…? అయితే తప్పకుండా మీరు దీని కోసం తెలుసుకోవాలి.
Video Advertisement
మామూలుగా వెంట్రుకలు పెరగాలంటే తగిన పోషక పదార్ధాలు అందాలి. వెంట్రుకలు అనేవి చర్మం లోపల మొదలవుతాయి. ఇవి ఎదగడానికి రక్తం సహాయం అవసరం. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలు రక్తంలో కలిసి వెంట్రుకల కుదుళ్ళకు చేరుతాయి. దీంతో వెంట్రుకలు ఏర్పడటం జరుగుతుంది. కణాలు నిర్మాణం అయ్యే కొద్దీ వెంట్రుకలు పెరుగుతూ వస్తాయి.
కాలి బొటనవేలుకి గుండెకి సంబంధం ఏమిటో తెలుసా…?
శరీరంలో మనకి వెంట్రుకలు మొలవడానికి తప్పకుండా ఆ ప్రదేశంలో రక్తం సరఫరా అవ్వాలి. కొందరికైతే కాలి బొటనవేలు పైన వెంట్రుకలు బాగా పెరుగుతాయి. కానీ మరి కొందరికి అసలు పెరగవు. కారణం ఏమిటంటే ఆ ప్రదేశంలో రక్తం సరఫరా అవ్వదు. రక్తం సరఫరా అవ్వక పోవడానికి కారణం రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ధమనుల్లో ఆటంకం ఏర్పడటం.. ఆహారం తినేటప్పుడు శరీరంలో ఎంతో కొంత కొవ్వు పేరుకుపోతుంది.
ఇలా పేరుకుపోయే కొవ్వు ముందుగా ధమనుల్లో చేరుతుంది. కొవ్వు ఎక్కువ పేరుకుపోతే రక్తం సరఫరా అవ్వదు. దీంతో వెంట్రుకలు పెరగడం జరగదు. మరి కొందరికి మనం గమనించినట్లైతే తల మరియు చేతుల పైన కూడా వెంట్రుకలు ఉండవు. వాళ్లకి గుండె జబ్బులు రావా అనేది చూస్తే తల భాగం, చేతులు గుండెకు దగ్గరగా ఉంటాయి. అయితే గుండెకి కాలి బొటనవేలు మాత్రం చాలా దూరంగా ఉంటుంది. అందుకే మనం దానిని లెక్కలోకి తీసుకోవాలి. కాలి బొటనవేలు పై వెంట్రుకలు బాగా పెరిగితే రక్తం సరఫరా బాగా ఉన్నట్లు. అంటే ఆరోగ్యంగా ఉన్నట్టే. దీంతో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
End of Article