Halim Seeds Uses, Benefits in Telugu: ప్రస్తుతం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పైన ఎంతో శ్రద్ధ పెడుతున్నారు. హెల్దిగా ఫిట్ గా ఉండడం కోసం యోగా, వ్యాయామాలు లాంటివి చేస్తున్నారు.రెగ్యులర్గా తాము తీసుకునే డైట్లో శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్, మినరల్స్ అందే రకంగా ఆహార పదార్థాలు ఉండేలా చూసుకుంటున్నారు. వీటిలో భాగంగానే పలు రకాల విత్తనాలను మరియు తృణధాన్యాలను రెగ్యులర్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Video Advertisement

What-are-halim-seeds-and-benefits-uses-in-telugu

మనం ఎక్కువగా అల్మండ్స్,సన్ఫ్లవర్ సీడ్స్ ,పుచ్చ గింజలు ,దోస గింజలు లాంటివి అందరూ తీసుకోవడం చూస్తాం. అయితే శరీరానికి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించే గింజల గురించి మనకు ఇంకా తెలియదని చెప్పాలి. అటువంటిదే హలీమ్ గింజల.. విటమిన్ల ఖజానాగా భావించే ఈ గింజలను ఆలివ్ గింజలు అని కూడా పిలుస్తారు. మరి ఇవి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

హలీం గింజలు వలన కలిగే ఉపయోగాలు

Halim Seeds Benefits in Telugu:

ఈ గింజలలో మన శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్ ఏ ,సి, ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇవి తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ కంటెంట్ రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో అధిక మోతాదులో లభ్యమయ్యే ఫైబర్ ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కడుపున శుభ్రపరచడమే కాకుండా మలబద్ధకం నివారిస్తుంది.

హలీం గింజల వలన లాభాలు !

అయితే ఎర్రగా చిన్నవిగా ఉండే ఈ గింజలను నిల్వ చేయడం ఎంతో కష్టం. కాస్త తేమ తగిలిన ఇది పాడైపోతాయి కాబట్టి బాగా ఎండబెట్టి ఎయిర్ టైట్ కంటైనర్ లో జాగ్రత్తగా భద్రం చేయాలి. వీటిని నేరుగా తీసుకోవచ్చు లేదా రోస్ట్ చేసి తినవచ్చు ,సోక్ చేసి మొలకలు ఎత్తించుకొని కూడా సలాడ్స్ లో కలపవచ్చు. అయితే వీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. పైగా ఇవి తీసుకోవాలి అనుకునే వారు ఒకసారి తమ డాక్టర్ను సంప్రదించి తర్వాత తీసుకోవడం మంచిది.

Find More Health News and Tips in Telugu Here