ఇదెక్కడి బిజినెస్ రా మామా.. పిల్లలకు పేర్లు పెట్టినందుకు ఏడు లక్షలా..? అసలు స్టోరీ ఏంటో చూడండి..!

ఇదెక్కడి బిజినెస్ రా మామా.. పిల్లలకు పేర్లు పెట్టినందుకు ఏడు లక్షలా..? అసలు స్టోరీ ఏంటో చూడండి..!

by Anudeep

Ads

ప్రతి ఒక్కరి జీవితం పెళ్లితో కొత్తగా మొదలైతే.. పిల్లలు పుట్టడంతో కొత్త మలుపు తీసుకుంటుంది. పిల్లలు పుట్టిన తరువాత పేరెంట్స్ గా మనం చాలా బిజీ అయిపోతూ ఉంటాము. వారికి పేరు పెట్టడం దగ్గరనుంచి ప్రతిదీ మనకి కొత్త పనే. తల్లిదండ్రులుగా మీరు తీసుకునే మొదటి నిర్ణయాలలో శిశువు పేరును ఎంచుకోవడం ఒకటి. ఈ పని ఈజీనేగా అనుకుంటూ ఉంటాం.

Video Advertisement

అయితే.. ఈ పని చేసి పెట్టడానికి కూడా ప్రొఫెషనల్స్ ఉన్నారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఒక ప్రొఫెషనల్ బేబీ నేమర్‌ని నియమించుకోవడం అనేది అంత తేలిక ఏమీ కాదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పనే.

hamphrey new

న్యూయార్క్‌కు చెందిన ‘ప్రొఫెషనల్ బేబీ నేమర్’, టేలర్ ఎ. హంఫ్రీ, తమ బిడ్డకు సరైన పేరుని ఎంచుకోవడం కోసం $1,500 (రూ. 1.14 లక్షలు) కంటే ఎక్కువ డబ్బులే చెల్లిస్తారట. కొంతమంది తల్లిదండ్రులు ఆశ్చర్యపరిచే విధంగా $10,000 (రూ. 7.6 లక్షలు) చెల్లించే వాళ్ళు ఉన్నారట. 33 సంవత్సరాల ప్రొఫెషనల్ బేబీ నేమర్ హంఫ్రీ పేర్లు పెట్టడంలో సాయం చేస్తారట.

hamphrey 1

గత సంవత్సరం, ఆమె వంద మందికి పైగా పిల్లలకు పేర్లు పెట్టడానికి సాయం చేశారట. ఈ సర్వీస్ $1,500 నుండి ప్రారంభమవుతుంది మరియు $10,000 వరకు ఉంటుంది. తక్కువ-శ్రేణి $1,500 సేవలో పాత కుటుంబ పేర్లను వెలికితీసి , వంశపారంపర్య పరిశోధన చేసి పేరు పెడతారట. ఇక $10,000 డాలర్ల సర్వీస్ లో బ్రాండ్ నేమ్ ను సూచిస్తారట. హంఫ్రీ 2015లో ఇలా పేర్లు పెట్టడాన్ని ప్రారంభించారట. మొదట్లో.. ఆమె తనకు ఇష్టమైన బేబీ నేమ్స్ ను, వాటి అర్ధాలను సోషల్ మీడియాలో పంచుకోవడం మొదలుపెట్టారట.

hamphrey 2

నాకు ఎంత తక్కువ మంది అనుచరులు ఉన్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే చాలా ఎక్కువ ఎంగేజ్ ఉందని నేను భావించాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించినప్పుడు, పేర్ల పట్ల వారి ప్రేమ గురించి ప్రజలు నా సలహా కోసం వస్తున్నారు. ఈ విషయంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. 2018 వరకు తాను ఇలానే పేర్లు పెట్టడంలో సాయం చేసానని.. అప్పుడే తనకి ఇందులో టాలెంట్ ఉందని, ప్రజలు పేర్లు పెట్టడం కోసం నా వద్దకి వస్తున్నారని గ్రహించానని చెప్పుకొచ్చారు. కాబట్టి మహిళలకు ఈ విషయంలో ఎందుకు సాయం చేయకూడదు అని భావించానని.. అనుకున్నట్లే ముందుకు సాగుతున్నానని చెప్పుకొచ్చారు.

https://www.instagram.com/reel/CVBpjPtl3tb/?utm_source=ig_embed&ig_rid=75246f9b-a515-462d-bdd8-9c08ec3a59d4


End of Article

You may also like