ఆ సమస్య వల్ల కనీసం పాపని ఎత్తుకోలేకపోయేదాన్ని.. 35 ఏళ్ల వయసులో ఈ తల్లి చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

ఆ సమస్య వల్ల కనీసం పాపని ఎత్తుకోలేకపోయేదాన్ని.. 35 ఏళ్ల వయసులో ఈ తల్లి చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

Ads

ఒక కన్నతల్లి తన చిన్నారి బిడ్డ కోసం తనను తాను శారీరకంగా, మానసికంగా దృడంగా ఎలా మలుచుకుంది అనే స్ఫూర్తిదాయకమైన కథ ఇది. ఎంతోమంది తల్లులకు ఈ కదా ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.

Video Advertisement

ప్రేరణ చదువుకునే రోజుల్లో చాలా నాజూకుగా అందంగా ఉండేది.  ఈ రోజుల్లో బాస్కెట్ బాల్ గేమ్ ఆడటం వల్ల శరీరాన్ని ఫిట్ గా వుంచుకునేది. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుని ఆ తర్వాత పిల్లలను కనడం ద్వారా తన శరీరంలో మార్పులు మొదలయ్యాయి.

ప్రేరణకు పాప పుట్టిన తర్వాత 2019లో భర్త ఉన్నత చదువులు కోసం జర్మనీ వెళ్లారు. తన కూతురిని చూసుకుంటూ ప్రేరణ ఇండియాలోనే ఉండిపోయింది. ఒంటరిగా గడపడం వలన అమితంగా ఆహారం తీసుకోవడంతో రెండు సంవత్సరాలలో దాదాపు తొంభై మూడు కిలోల బరువు పెరిగిపోయింది.

అప్పటికీ ఆమె పాప అనైషాకు నాలుగు సంవత్సరాల వయస్సు.  పాప ఒక రోజు వున్నట్టు వుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. అన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత పాప క్యాన్సర్ ఉందని వైద్యులు తేల్చి చెప్పేశారు.

 

ఎత్తుకొని ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగింది. అధిక బరువు కారణంగా ఆయాసానికి విపరీతమైన నడుము నొప్పిని ఎదుర్కొంది . పాప కు చికిత్స చేసి కొంత సమయం ఒడిలోనే కూర్చోబెట్టుకొని ఉండటంతో కండరాలు పట్టేసి వాష్ రూమ్ కి కూడా వెళ్ళలేకపోయేది. దీని కారణంగా నీరు తాగడం తగ్గించింది.. ఇలా చేయడం ద్వారా ప్రేరణ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. చికిత్స వలన నీరసపడుతున్న  తన పాప ఆలనాపాలనా చూడడానికి ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. సాధారణ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంది. పాపకు కీమోథెరపీ చేసిన తర్వాత నిద్రపుచ్చి ఆ చిన్న లైట్ వెలుతురులోనే వర్కవుట్ చేయడం మొదలు పెట్టింది.

 

తన వర్కౌట్  షెడ్యూల్ని మార్పులు చేసుకుంటూ వచ్చింది. రోజుకు 4 లీటర్ల వరకు నీరు తీసుకునేది.లిఫ్ట్ కి బదులుగా మెట్టు మార్గం వేయిన్చుకునేది. ఇలా పది నెలల కాలంలో 20 కేజీల బరువు తగ్గింది. నాలుగు అడుగులు కూడా వేయలేకపోయిన ప్రేరణ ఇప్పుడు 4,5 కిలోమీటర్లు సునాయాసంగా నడవగలను ఉంటుంది. ఈ విధంగా తన శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకుని తన పాపని ఎత్తుకొని ఎంత సేపు అయిన ఉండగలనా అంటోంది. ఇలా ఉత్సాహంగా  ఉంటూ పాపను చూసుకోవడం ద్వారా పాప ఆరోగ్యం మెరుగు పడింది. క్యాన్సర్ వ్యాధి నుంచి బయట పడింది. తన చిన్నారి పాప కోసం ప్రేరణ అధిక బరువు తగ్గించుకోవడంలో సక్సెస్ సాధించింది. ఇంకో రెండు మూడు నెలల్లో ఇంకాస్త బరువు తగ్గుతాను అంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

This article sourced from: ఈనాడు 

 


End of Article

You may also like