తెలుగు నటి గౌతమి 80 ,90 దశకాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆమె తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించారు. శ్రీకాకుళం లో జన్మించిన ఈమె స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించారు. ఈ అందాల భామ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. గౌతమి మంచి ఫామ్ లో ఉండగానే 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

Video Advertisement

కానీ ఈమె పెళ్లి సంవత్సరానికే ముగిసిపోయింది. మనస్పర్ధల కారణంగా భర్త నుంచి డివోర్స్ తీసుకుని విడిపోయారు గౌతమి. అప్పటికే ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఆ అమ్మాయికి సుబ్బులక్ష్మి అని పేరు పెట్టారు. కొన్నాళ్ల అనంతరం గౌతమి నటుడు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు. అలా పది సంవత్సరాల పాటు జరిగిన వారి సహజీవనంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో గౌతమి కమలహాసన్ నుంచి దూరంగా వచ్చేసి కుమార్తె తో ఒంటరిగా నివసిస్తుంది.

have a look at actress gouthami's daughter..

ఆ తరువాత సామాజిక సేవ, రాజకీయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న గౌతమి అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. అయితే తాజాగా గౌతమి కుమార్తె సుబ్బులక్ష్మి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన సుబ్బలక్ష్మి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలను నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.

have a look at actress gouthami's daughter..

హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది సుబ్బు లక్ష్మి. కొన్ని ఫొటోల్లో తన తల్లి గౌతమితో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది సుబ్బలక్ష్మి. గౌతమి కూడా తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సినీ బాక్గ్రౌండ్ కాబట్టి సుబ్బలక్ష్మికి హీరోయిన్గా ఛాన్సులు రావడం పెద్ద కష్టం ఏమి కాదు. ఇక త్వరలో ఆమెను హీరోయిన్గా చూసే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు అభిమానులు. తన తల్లి పోలికలు ఆమె లో పుష్కలం గా ఉన్నాయంటూ గౌతమి ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

have a look at actress gouthami's daughter..

38 ఏళ్ళ వయసులో కాన్సర్ బారిన పడ్డారు గౌతమి. దాన్నుంచి కోలుకున్న తర్వాత ‘ లైఫ్ అగైన్ పౌండేషన్ ‘ బాధ్యతలను చేపట్టింది. కాన్సర్ బారిన పడిన వారికి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ మంచి మోటివేటర్ గా మారింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా పలు సినిమాల్లో పని చేసింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా చాలా అవార్డ్స్ గెలుచుకుంది. గౌతమి 1998 తర్వాత కెరీర్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇటీవల ‘ స్టోరీ ఆఫ్ థగ్స్’ అనే తమిళ్ సిరీస్, సమంత ‘శాకుంతలం’ తో పాటు ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాల్లో నటించారు.