Ads
వృక్షజాతిలోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టు వేప చెట్టు. భారతదేశంలో వేప చెట్టు లేని స్థలం అంటూ లేదు. ఈ వేప చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది బయట ఉంటే ఏం జరుగుతుంది. వేప చెట్టును కాంపౌండ్ లోపల ఎందుకు పెంచకూడదు. వేపచెట్టు అనేది శ్రీమహాలక్ష్మి యొక్క స్వరూపం. రావిచెట్టు అనేది శ్రీమహావిష్ణువు యొక్క స్వరూపం. అందుకే ఈ రెండు చెట్లకు పెళ్లిళ్లు కూడా చేస్తారు.
Video Advertisement
అయితే వేప చెట్టు ఇంటికి దగ్గరలో ఉంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఈ వేప చెట్టు కాంపౌండ్ బయట అది కూడా తూర్పు వైపు ఉంటే ఫలితాలు ఏమిటి..? తూర్పు వైపు చెట్టు ఉంటే దాన్ని ఇంద్రస్థానం అంటారు. ఇది పనులకు ఆటంకం కలిగిస్తుంది. దీని కోసం మనం గురు, శుక్ర వారాల్లో మహాలక్ష్మీ అమ్మవారికి ఎల్లో కలర్ పసుపు తాడు, లేకుంటే తెల్ల దారానికి పసుపు పూసి, కలర్ దారాన్ని తీసుకోవచ్చు.
తర్వాత 108 రౌండ్లు ఆ చెట్టు చుట్టూ చుట్టినట్లయితే ఆ చెట్టు ఏ పనులకు అయితే అడ్డంకి కలిగిస్తుందో ఆ పనులు తొందరగా జరుగుతాయి. అలాగే గురు శుక్రవారాల్లో వేప చెట్టుకు మనం దేవునికి ఏ విధంగా పూజ చేస్తామో ఆ విధంగానే పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి వేప చెట్టుకు పూజ చేయడమే కాకుండా వాటిని
ఎప్పుడు కూడా నరికి వేయకూడదు. ఎందుకంటే వేప చెట్టు నుంచి వచ్చే గాలి వాతావరణంలో మంచి ఔషధంలా పనిచేస్తుంది. వేప లో అనేక ఔషధ గుణాలు ఉండటం వల్ల పొద్దున్నే దాంతో పళ్ళు శుభ్రం చేసుకుంటే మనకు ఎలాంటి రోగాలు దరిచేరవని నిపుణులు తెలుపుతున్నారు.
End of Article