ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలను చాలా మంది గుడ్డిగా నమ్మేస్తారు. ఒక పక్క సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందుతున్నా.. ఇటువంటి వాటిలో మార్పు రావడం లేదు. చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి ఆచారాలని తప్పు అని చెప్పడం లేదు. అయితే ప్రతి దానికి కూడా ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. అదే విధంగా జీవితంలో చాలా ముఖ్యమైన పెళ్ళికి కూడా ఆచారం అనేది ఉంటుంది. పెళ్లి అనేది ఆచారం, సాంప్రదాయం ప్రకారం చేస్తూ ఉంటారు. మామూలుగా మనం పెళ్లి అంటే శాస్త్రోత్తంగా నిర్వహించడం… శాస్త్రం ప్రకారం అనుసరించడం… మన ఆచారం బట్టి ఫాలో అయిపోవడం లాంటివే మనకి తెలుసు.

Video Advertisement

కానీ ఇవి వేరు. ఈ ఆచారాలు చాలా వింతగా వున్నాయి. వీటిని కనుక చూశారంటే తప్పక ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో పెళ్లి విషయంలో జరిగే ఈ వింత ఆచారాల్ని ఎవరు చూసినా షాక్ కి గురిచేస్తాయి. మరి ఆ ఆచారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలో నువ్వలరేవు అనే ఊరు కలదు. అక్కడ ఆచారం ఏమిటంటే మా ఊరి గ్రామస్తులు మరే ఇతర గ్రామస్తులునీ పెళ్లి చేసుకోరు. కేవలం ఆ ఊరు వాళ్లనే వారు పెళ్లి చేసుకుంటారు. పైగా సాధారణంగా ఏ పెళ్లిలో అయినా సరే వరుడు వధువు కి తాళి కడతాడు. కానీ ఇక్కడ మాత్రం వధువు వరుడుకి తాళి కడుతుంది. అక్కడ వింత ఆచారం ఇది మరి.

ఇదిలా ఉంటే మరొక వింత ఆచారం ఉంది. అదే తండ్రి కూతుర్ని వివాహం చేసుకోవడం. కూతురికి 13 ఏళ్ళు వచ్చాక దత్తపుత్రిక అయ్యి ఉంటే ఆమెను వివాహం చేసుకుంటాడు తండ్రి. ఇది ఆచారం కాదు చట్టం. ఈ చట్టం ఇరాన్ దేశంలో ఉంది. 2013లో ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది.

అదే విధంగా ఇండోనేషియాలో మరొక వింత ఆచారాన్ని పాటిస్తారు. ఇక అదేమిటంటే.. ఇండోనేషియాలో పెళ్లి మండపం లో పెళ్లి కూతురిని కిడ్నాప్ చేయాలి. ఇండోనేషియాలో సుంబా అనే దీవిలో అక్కడి కుర్రాళ్లకు అమ్మాయిలు నచ్చితే కిడ్నాప్ చేస్తారు. అయితే ఎవరినైతే ఎత్తుకెళ్లారో వాళ్లతో పెద్దలు వివాహాన్ని చేస్తారు. ఒకవేళ ఆమెకి అబ్బాయి నచ్చకపోయినా సరే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఇది అక్కడ ఆచారం.