Ads
మనం ప్రేమని చూపించడానికి ఒక ముద్దు చాలు. నిజంగా మనకి ఇతరులపై ఉండే ఇష్టాన్ని, ఆప్యాయతని ఒక ముద్దు పెట్టి చూపించొచ్చు. కేవలం మనుషులకే కాదు జంతువులుకి కూడా వాటి యొక్క ప్రేమని ఇలా తెలియజేస్తాయి అయితే మనుషులకి ఉండే అలవాటు బట్టి వాళ్ళ యొక్క ప్రేమని ముద్దుతో చూపుతాయి.
Video Advertisement
కొందరు కౌగలించుకొని వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తపరిస్తే మరికొందరు ముద్దుపెట్టుకొని ప్రేమని చూపుతాయి. అలాగే ముద్దు అంటే మనకి ఫ్రెంచ్ కిస్, ఇంగ్లీష్ కిస్ ఇలాంటివి ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ అయితే మనం దానిని శృంగార ప్రక్రియలోనే తీసుకుంటాము కానీ విదేశాల్లో ఇది చాలా సాధారణం.
ముద్దు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. అదేంటి ముద్దు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనమా అని ఆలోచిస్తున్నారా…? అవునండీ ముద్దు పెట్టుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ని మనం పొందొచ్చు. మరి వాటి కోసం తెలుసుకుందాం.
ముద్దు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దూరం అయిపోతాయి. భార్య భర్త ఇద్దరు ముద్దు పెట్టుకునేప్పుడు మంచి అనుబంధం ఏర్పడుతుంది. అలానే ఎక్కువ సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది.
అదే విధంగా ముద్దు పెట్టుకునేటప్పుడు అడ్రినలిన్ అనే ఒక రసాయనం విడుదలవుతుంది. ఇది నొప్పులు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
ముద్దు పెట్టుకునేటప్పుడు సలైవా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అది దంతాలను సురక్షితంగా ఉంచుతుంది. దంతక్షయం కూడా దూరం అవుతుంది.
ముద్దు పెట్టుకునేటప్పుడు సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి రసాయనాలు కూడా విడుదలవుతాయి. ఇది మనిషికి ఎంతో రిలాక్స్ గా ఉంచుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. తల నొప్పి కూడా తగ్గుతుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
ముద్దు పెట్టుకునే ప్రక్రియలో మెడ, దవడ కండరాలకు వ్యాయామం జరుగుతుంది దీనితో వాటికి మంచి ఆకారం వస్తుంది.
ముద్దు పెట్టుకుంటే నిమిషానికి రెండు నుండి మూడు క్యాలరీలు ఖర్చు అవుతాయి దీనివల్ల మెటబాలిజమ్ రేటు పెరుగుతుంది. అదేవిధంగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. రక్తపోటును కూడా నియంత్రించవచ్చు.
End of Article