వేసవి అని నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారా..? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!

వేసవి అని నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారా..? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!

by Megha Varna

Ads

వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు దాహం ఎక్కువ వేస్తుంది. అలాంటప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా నిమ్మరసం తీసుకుంటూ ఉంటాము. నిమ్మ రసం తీసుకోవడం వల్ల వెంటనే దాహం తగ్గి.. మనకి ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. అయితే ఎవరికి నచ్చిన పద్ధతి లో వాళ్లు నిమ్మ రసాన్ని తయారు చేస్తారు.

Video Advertisement

కొందరు పంచదార వేసి తీసుకుంటే.. మరి కొందరు సాల్ట్ ని వేసుకుంటారు. నిజానికి నిమ్మ రసం వల్ల చాలా బెనిఫిట్స్ మనం పొందొచ్చు. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

అలానే నిమ్మలో ఉండే యాసిడ్ ఆమ్లాలు కడుపులో వుండే చెడు క్రిముల్ని తొలగిస్తాయి. అయితే ఇన్ని లాభాలను మనం నిమ్మరసం వల్ల పొందొచ్చు కదా అని ఎక్కువగా తాగుతుంటే పొరపాటే. అతిగా నిమ్మరసం తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరీ అధికంగా నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

#1. యూరినేషన్ సమస్య:

ఎక్కువగా నిమ్మరసం తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి నిమ్మరసం ను అతిగా తీసుకో వద్దు.

#2. గాల్ బ్లాడర్, కిడ్నీ స్టోన్స్ సమస్య:

నిమ్మ రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఇబ్బందులు కూడా తప్పవు. అయితే క్యాల్షియం శోషణకి అంతరాయం కలిగిస్తుంది. శోషణ జరగకపోవడం వల్ల గాల్ బ్లాడర్, కిడ్నీ స్టోన్ సమస్యలు కలుగుతాయి.

#3. గ్యాస్ట్రో ఈసోఫోల్ రిఫ్లక్స్ డిసీజ్:

అతిగా నిమ్మను తీసుకోవడం వల్ల ఈ ఇబ్బంది కూడా తప్పదు. గుండె లో మంట, వాంతులు, ఛాతి లో నొప్పి, గొంతు నొప్పి, వికారం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

#4. కడుపులో ఇబ్బంది:

నేరుగా నిమ్మ రసం తీసుకోవడం వల్ల స్టమక్ అప్ సెట్ అవుతుంది. లూజ్ మోషన్స్, కడుపు నొప్పి వంటివి కలుగుతాయి. కనుక నిమ్మని అతిగా తీసుకోకండి. తీసుకుంటే ఈ ఇబ్బందులు తప్పవు.


End of Article

You may also like