ఓటీటీలో రిలీజ్ అయిన సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ…ఈ సిరీస్ చూసారా.?

ఓటీటీలో రిలీజ్ అయిన సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ…ఈ సిరీస్ చూసారా.?

by Harika

Ads

ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇంతకుముందు కొత్త సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులు రాను రాను ఓటీటీ లో సినిమాలు, వెబ్ సిరీస్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హాల్ కి వెళ్లి చూసే టైం, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొని సినిమాలోని వెబ్ సిరీస్ ని చూస్తున్నారు.

Video Advertisement

వారం, వారం కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త వెబ్ సిరీస్ లు ఓటీటీ లో రిలీజ్ అవుతూ ఉండటంతో వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నేటి యువత. యువత అభిరుచులకు తగ్గట్టుగానే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వెబ్ సిరీస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. భాష ఏదైనా సరే కంటెంట్ బాగుంటే సబ్ టైటిల్స్ తో అయినా సదరు సినిమాను గాని సీరీస్ ని గాని ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే ఇప్పుడు ఓటీటీ లో మెడికల్ జోనర్ లో వచ్చిన హార్ట్ బీట్.. ది రిథమ్ ఆఫ్ లైఫ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తమిళ వెర్షన్ వెబ్ సిరీస్. ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ యూత్ ఫుల్ సిరీస్ గా తెరకెక్కించబడింది. కథ విషయానికి వస్తే ట్రైనీ డాక్టర్ రీనా పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లో రీనా అనే ట్రైనీ డాక్టర్ మొదటి రోజు ఆలస్యంగా వస్తుంది. దానివల్ల సీనియర్ డాక్టర్ రాధిక కోపానికి గురవుతుంది.

తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఆ ఇబ్బందులను రీనా ఎలా సాల్వ్ చేసుకుంటుంది. ఆమె నేపథ్యం ఏమిటి అన్నదే కధ. ఈ సిరీస్ ని అమెరికన్ షో గ్రేస్ అనాటమీ ఆధారంగా తెరకెక్కించారు. సుందర రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో మలయాళీ నటి అనుమోల్, యోగలక్ష్మి, థాపా, దీపా బాలు, చారుకేష్, జయరావు, గిరి ద్వారకేష్, దేవిశ్రీ, కవితాలయ కృష్ణన్ తదితరులు నటించారు.


End of Article

You may also like