Ads
ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో గుండెపోటు కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వడం వల్ల చాలా సమస్యలకు మనం చెక్ పెట్టడానికి అవుతుంది.
Video Advertisement
చిన్న వయసులో కూడా ఎక్కువ మంది గుండెపోటుతో ప్రాణాలను కూడా కోల్పోతున్నారు కాబట్టి ఎప్పుడూ కూడా హృదయ సంబంధిత సమస్యలను అశ్రద్ధ చేయకూడదు.
హృదయానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం మొదలు సరైన జీవనశైలిని ఫాలో అవ్వడం వంటివి చేస్తే సమస్యలు కలగవు.
#1. ఎక్కువ ఉప్పుని తీసుకోకండి:
అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కలుగుతుంటాయి. వంటల్లో దీనిని తగ్గించడం వల్ల చాలా మటుకు సమస్యకు చెక్ పెట్టొచ్చు.
#2. షుగర్ కి దూరంగా ఉండండి:
అధికంగా చక్కెర ఉపయోగించడం వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి షుగర్ యొక్క వాడకాన్ని తగ్గిస్తూ ఉండాలి.
#3. నూనెను తగ్గిస్తూ ఉండాలి:
నూనె అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనితో గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది కనుక నూనెను కూడా తగ్గిస్తూ ఉండాలి.
#4. మాంసంను తగ్గిస్తూ ఉండాలి:
మాంసాన్ని అధికంగా తినడం వల్ల గుండె సమస్యలు కలుగుతాయి కొలెస్ట్రాల్ ని ఎక్కువగా పెంచేస్తుంది మాంసం. దీని మూలంగా గుండె జబ్బులు వస్తాయి కనుక దీనిని కూడా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
గుండె ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి..?
#1. శారీరిక వ్యాయామం:
శారీరిక ఆరోగ్యం ఉంటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. కనుక మీ సమయంలో కాస్త సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించండి.
#2. ప్రశాంతంగా వుండండి:
ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే కూడా గుండె సమస్యలు రావు.
#3. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోండి:
ఆకుకూరలు, కూరగాయలుని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే గుండె సమస్యలు కలగవు. గుండె ఆరోగ్యం బాగుంటుంది.
End of Article