RIP అని ఇర్ఫాన్ కి మెసేజ్ చేస్తే ఏమని రిప్లై వస్తుందో తెలుసా? చూస్తే కన్నీళ్లొస్తాయి!

RIP అని ఇర్ఫాన్ కి మెసేజ్ చేస్తే ఏమని రిప్లై వస్తుందో తెలుసా? చూస్తే కన్నీళ్లొస్తాయి!

by Anudeep

Ads

భావోద్వేగాలనేవి మానవసంబంధాలకు ఆత్మలాంటివి.. భావోద్వేగాలను కోల్పోయిన మానవ సంబంధాలు జీవశ్చవాలంటివే..ఈ భావోద్వేగాల(ఎమోషన్స్) మూలంగానే అవతల వ్యక్తి మనకు తెలియకపోయినా, పరిచయం లేకపోయినా వారితో తెలీకుండానే మన జీవిత ప్రయాణంలో భాగం అవుతారు..ఇలా  ఎమోషనల్ బాండ్ ఏర్పడినప్పుడు ఆయా వ్యక్తులకు మంచి జరిగితే సంతోషిస్తాం..వాళ్లు బాధపడితే మనకు తెలియకుండానే బాధపడతాం.

Video Advertisement

ఇటీవల కాలంలో భౌతికంగా మనకు దూరమైన ఇర్ఫాన్ ఖాన్ విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. తనదైన విలక్షణ నటనతో సినిప్రేమికులకు ఎంతో ప్రియమైన ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మరణించారు.. అయినప్పటికి ఇర్ఫాన్ ఖాన్ తో ఒక ఎమోషనల్ అటాచ్ మెంట్ పెంచుకున్న ఆయన అభిమానులు అనేక రూపాలుగా గుర్తు  చేసుకుంటున్నారు..ఇర్పాన్ ఖాన్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆయన అకౌంట్స్ ని  ఫాలో అవుతూ,వారి వారి ఫీలింగ్స్ ని శేర్ చేసుకుంటున్నారు.

ఇర్పాన్ ఖాన్ పట్ల తమ భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ ఫాలో అవుతున్న ఫ్యాన్స్ కి , ఆ అకౌంట్స్ నుండి వస్తున్న ఆటోమేటిక్ రిప్లైస్ వారిని మరింత ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి…”థాంక్యూ సర్,మీరెవరో నాకు తెలియకపోయినా మీరు నా జీవితాన్ని టచ్ చేసారు..నాకు ఇలాంటి మెటిరియలిస్టిక్ థింగ్స్ పై నాకు నమ్మకం లేదు..నేను సంపాదించిన ఆస్తి మీలాంటి అభిమానులే” అంటూ వచ్చే ఆ రిప్లై   క్షణకాలం పాటు ఇర్ఫాన్ నుండే మెసేజ్ వచ్చిందా అన్నట్టుగా, ఇర్ఫాన్ మనతో మాట్లాడుతున్నారా అనిపించేలా చేస్తున్న ఆ మెసేజెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారాయి..మీకు ఇర్ఫాన్ అంటే అమితమైన ప్రేమ ఉంటే మీరు కూడా మెసేజ్ చేసి చూడండి..

 


End of Article

You may also like