ఒక పాట హిట్ అవ్వాలంటే సంగీతానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. సాహిత్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండు బాగా కుదిరిన పాటలకి చక్కటి గాత్రం జతకడితే.. వినసొంపుగా ఉంటుంది. ఇలా సినిమాల్లో వచ్చే పాటలు ఆకట్టుకుంటూనే ఉంటాయి. అయితే.. మోడరన్ మ్యూజిక్ వచ్చాక జానపదాలు కాస్త వెనకపడ్డాయి.

Video Advertisement

ఈ మధ్య జానపదాలు కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. పాపులర్ అయిన జానపదం పల్లవిని తీసుకుని.. సొంతంగా పాటలు రాసుకుని సినిమాల్లో ఉండేలా చూసుకుంటున్నారు.

private song 1

ఇలాంటి పాటలు కూడా చాలానే హిట్ అవుతున్నాయి. మరో వైపు ప్రైవేట్ సాంగ్స్ కూడా సినిమా పాటలతో పోటీ పడుతున్నాయి. అచ్చం సినిమాల్లో షూట్ చేసినట్లే వీటిని కూడా షూట్ చేస్తారు. అలా “సిటికేస్తే పోయే ప్రాణం.. అంటూ జానపదం లాగ సాగే ఈ ప్రైవేట్ సాంగ్ కూడా యూట్యూబ్ లో నెటిజన్స్ అభిమానాన్ని చూరగొంటోంది.

private song 2

ఓ రోజంతా ఈ పాట నెం.1 ట్రెండింగ్ లో నిలిచింది. ఓ సైనికుడు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. డ్యూటీ లో జాయిన్ అవ్వాలి అంటూ అతనికి లెటర్ వస్తుంది. ఆ లెటర్ తో పాటే వారిద్దరి మధ్య దూరం కూడా ఏర్పడుతుంది. భౌతికంగా వారు దూరంగా ఉన్నా.. ఒకరినొకరు తలుచుకుంటూనే ఉంటారు.

private song 3

బోర్డర్ లో ఉన్న ఆ సైనికుడు తన ప్రేయసి అయిన భార్యని తలుచుకుంటూ పాడే పాట ఇది. అచ్చ తెలుగు జానపదంలా కనిపించే ఈ సాహిత్యం వింటూ ఉంటె.. ఓ సైనికుడి విరహాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ రాయలేరు అనిపిస్తుంది. ఈ పాటని ఒక్క రోజులోనే దాదాపు 22 లక్షల మంది వీక్షించారు. ఇప్పటికే ఈ వీడియో మూడు కోట్ల వ్యూస్(ఈ ఆర్టికల్ రాసే సమయానికి) కి పైగా సంపాదించుకుంది. ఆ వీడియోను మీరు కూడా ఇక్కడ చూసేయచ్చు.

Watch Video: