‘సలార్’ లో హీరో పేరు లీక్..! అది ఏంటంటే..?

‘సలార్’ లో హీరో పేరు లీక్..! అది ఏంటంటే..?

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ మారారు. ఆయన ప్రస్తుతం వరస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీ తెరకెక్కుతోంది.

Video Advertisement

ఈ చిత్రం ప్రకటన వచ్చినప్పటి నుండే సలార్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవడం ఖాయమని ప్రభాస్ అభిమానులు ఫిక్స్‌ అయిపోయారు. దానికి తగ్గుట్లుగానే డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ ఈ మూవీని భారీగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో క్లారిటీ రాలేదు. ఇటీవల ఈ మూవీలో విలన్ క్యారెక్టర్స్ లో ఒకరిగా చేస్తున్న  యాక్టర్ దేవరాజ్ ఈ చిత్రం గురించి పలు విషయాలను తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో దేవరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సలార్’ మూవీలో నటిస్తున్నానని తెలిపారు.
ఈ మూవీలో తన పాత్ర గురించి చెప్తూ తన క్యారెక్టర్ మొదటి భాగంలో కన్నా, రెండవ భాగంలో హైలైట్ గా ఉంటుందని  వెల్లడించారు. దేవరాజ్ రెండవ భాగంలో నా పాత్ర హైలెట్ అనడంతో సలార్’ మూవీ రెండు పార్ట్స్ గా తీస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరో పేరు కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. సలార్ లో హీరో పేరు ‘దేవా’ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: “హలో” సినిమాలో హీరో చిన్నప్పటి రోల్ చేసిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?


End of Article

You may also like