మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించబోయే మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస  సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫ్లాప్ హీరోయిన్లకు కూడా తన సినిమాలలో అవకాశం ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్, కొన్ని సంవత్సరాల కిందట బ్రూస్ లీ అనే మూవీలో శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించారు. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బ్రూస్ లీ మూవీ 2015లో  అక్టోబరు 16న రిలీజ్ అయ్యి, ఫ్లాప్ గా నిలిచింది.అయితే ఆ తరువాత కాలంలో రామ్ చరణ్ డైరెక్షన్ లో ధృవ మూవీలో నటించారు. ఈ మూవీలో రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీ ఫ్లాప్ అయిన ఆ మూవీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ధృవ మూవీలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను పాటిస్తూ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీకి ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఎందుకంటే 2019లో రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.
అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ హీరోయిన్ కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ లో ఛాన్స్ ఇచ్చారు. దాంతో నెట్టింట్లో రామ్ చరణ్ ఫ్లాప్ సెంటిమెంట్లను పట్టించుకోరని, అందువల్లే ఫ్లాప్ మూవీ హీరోయిన్లకు తన చిత్రాలలో ఛాన్స్ ఇస్తున్నారని అంటున్నారు.

Also Read: హీరో అక్కినేని నాగార్జున సోదరి.. హీరో సుశాంత్ తల్లి నాగసుశీల పై కేసు..