బాలీవుడ్ స్టార్ సెలెబ్రెటీ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ లో మూడు ముళ్ల బంధం తో ఒక్కటయ్యారు. గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ స్టార్ కపుల్ పెళ్లి చేసుకున్నారు. అనంతరం తన ప్రెగ్నన్సీ గురించి ప్రకటించిన అలియా.. అలాగే బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది. ఈ జంటకు నవంబర్ 6 న ఒక పాప పుట్టింది. ఆ పాపకి రాహా కపూర్ అని పేరు పెట్టారు.

Video Advertisement

 

పెళ్ళికి ముందు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ తో స్ట్రాంగ్ రిలేషన్ మైంటైన్ చేసిన రణ బీర్ చివరికి 40 ఏళ్ళకి అలియా ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 11 ఏళ్ళ వ్యత్యాసం ఉంది. రణబీర్ హీరో కాక ముందు నుంచే తనకు ఇష్టమని అలియా పలు సందర్భాల్లో వెల్లడించింది. అయితే 2017 లో బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ సమయం నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు అలియా భట్ కూడా పలువురు హీరోలతో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి.

ranbeer kapoor about his daughter..

అయితే బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన రణబీర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాజాగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన రణ్‌బీర్.. తనకున్న అతిపెద్ద అభద్రత గురించి రివీల్ చేశాడు. ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణబీర్ మాట్లాడుతూ.. ‘నాకున్న బిగ్గెస్ట్ ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ ఏంటంటే.. నా పిల్లలు 20, 21 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నాకు 60 ఏళ్లు ఉంటాయి. నేను వారితో ఆడగలనా? అసలు నేను ఉంటానా? అని సందేహం వ్యక్తం చేశాడు.

ranbeer kapoor about his daughter..

మరోవైపు అలియా రణ్ జోహార్ దర్శకత్వంలో ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ చిత్రంలో రణవీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్‌లతో కలిసి నటించనుంది. రణబీర్ శ్రద్ధ కపూర్ తో ఒక చిత్రం, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో ‘యానిమల్’ చిత్రం చేయనున్నాడు. ఇందులో రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్‌‌తో కలిసి నటించనున్నారు.