మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస  విజయాలతో  అందుకున్నారు. ఇటీవల ‘రావణాసుర’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.

Video Advertisement

ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వమ వహించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర  నిరాశ పరిచింది. ప్రస్తుతం రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా రవితేజ రెమ్యూనరేషన్ పెంచినట్టుగా  సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. రవితేజ నటించిన రావణాసుర మూవీ రీసెంట్ గా విడుదలై, ప్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రవితేజ తాజాగా తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రవితేజ ఒక్కో మూవీకి 15 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునేవారంట. అయితే ప్రస్తుతం 25 కోట్లు నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారట. రీసెంట్ గా కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తో రవితేజ ఒక సినిమాను చేయడానికి ఒకే చెప్పాడు. ఇక ఈ చిత్రం కోసం 25 కోట్లు పారితోషికం అడిగినట్లు సమాచారం.
రవితేజ డిమాండ్ కి మొదట ప్రొడ్యూసర్స్ షాక్ అయినప్పటికి, ఆ తర్వాత రవితేజ అడిగినంత ఇవ్వడానికి అంగీకరించారని సినీ వర్గాలలో టాక్. ప్రస్తుతం ఉన్న యువ స్టార్ హీరోలు 25 – 50 కోట్ల వరకు పారితోషకం  తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు వాళ్ల కంటే కొంచెం సీనియర్ హీరో రవితేజ రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇటీవల రవితేజ సినిమా రావణాసుర ప్లాప్ అయినా ఆయన పారితోషికం పెంచడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. రవితేజ ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ షూటింగ్ పూర్తి చేసి, నెక్స్ట్ మూవీ ‘ఈగల్’ షూటింగ్ లో  బిజీ బిజీగా ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’ మూవీతో డైరెక్టర్ గా మారుతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతోంది.

Also Read: CUSTODY REVIEW : “నాగ చైతన్య” ఈ సినిమాతో హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!