సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అంత త్వరగా రావు. వచ్చిన వాటిని సద్వినియోగ పరచుకొనేవారే ఇక్కడ నిలదొక్కుకోగలరు. అలాంటి అతి కొద్దీ మందిలో సిద్దార్ధ్ ఒకరు. ప్రముఖ దర్శకుడు మణి రత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అతడు.. బాయ్స్ సినిమాతో హీరోగా మారాడు. ఒక్క సినిమాతో చాలా పాపులర్ అయ్యాడు.

Video Advertisement

 

 

ఈ సినిమా యువతపై అంతటి ప్రభావాన్ని చూపించింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ సాధించింది. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సిద్దార్థ్ కి ఆ అవకాశం దక్కడానికి కారణం ఒక వ్యక్తి. ఆమే సుజాత. తాజాగా టక్కర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు సిద్దార్థ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు సిద్ధార్థ్.

 

hero siddarth got emotional by seeing that woman.. who is she..

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్ ఒక మహిళ స్టేజీపైకి రావడంతో ఎమోషనల్ అయ్యారు. ఆమె కాళ్ల మీద పడి నమస్కరించడంతో పాటు.. ఆలింగం చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకు ఆమె ఎవరంటే.. తమిళ పరిశ్రమకు చెందిన సుజాత రంగరాజన్. ఆమె దర్శకుడు శంకర్‍కు చెబితేనే బాయ్స్ సినిమాకు హీరోగా సిద్దార్థ్‌ను తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

hero siddarth got emotional by seeing that woman.. who is she..

 

అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిరత్నం దగ్గర పని చేస్తున్న సమయంలో ప్రఖ్యాత రచయిత సతీమణి అయిన సుజాత రంగరాజన్, శంకర్ చేయబోయే బాయ్స్ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ బాగుంటాడని శంకర్ కు సలహా ఇచ్చారు. సిద్ధార్థ్ కు హీరోగా చేయడం ఇష్టం లేకపోయినా, శంకర్ ఫోన్ చేసి ఫోటోషూట్ కోసం రమ్మంటే వెళ్లాడు. అలా బాయ్స్ సినిమాలో హీరోగా ఎంపికయ్యాడు. అలా స్టార్ హీరోగా మారిపోయారు సిద్దార్థ్.

 

hero siddarth got emotional by seeing that woman.. who is she..

అదే ప్రోగ్రామ్ లో సుజాత రంగరాజన్ గురించిన మాట్లాడిన సిద్ధార్థ్, ఆ రోజు బాయ్స్ సినిమాలో అవకాశం రాకపోతే నా జీవితం వేరేలా ఉండేదని ఎమోషనల్ అయ్యాడు. ఆమె రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని చెప్పారు. ఆమె లేక 20 ఏళ్ల సిద్ధార్థ్ కెరీర్ లేదన్నారు. ఇదొక పెద్ద సర్ ప్రైజ్ అన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2లో నటిస్తున్నారు.

https://twitter.com/poornachoudary1/status/1666385665536450560