బిచ్చగాడు ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళ్ అయినా తెలుగులో డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

Video Advertisement

కోలీవుడ్ లో వచ్చిన ‘పిచ్చైకారన్’ మూవీని ‘బిచ్చగాడు’ అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌‌‌, అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. కాగా, ఈ మూవీని ప్రముఖ తెలుగు హీరో మిస్ చేసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ముఖ్యంగా బిచ్చగాడు  సినిమాలోని మదర్ సెటిమెంట్ అందరిని కదిలించింది. క్లాస్ మాస్ భేదం లేకుండా అన్నీ వర్గాల ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముందుగా తెలుగు హీరో శ్రీకాంత్ ను అనుకున్నారట. ఈ విషయన్ని శ్రీకాంత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను ఇలా చెప్పుకొచ్చారు. విజయ్ ఆంటోని తాను హీరోగా నటించిన ‘మహాత్మ’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అప్పటి నుండి విజయ్ తో పరిచయం ఉందని అన్నారు. తరువాత విజయ్ తమిళంలో ‘పిచ్చైకారన్’ మూవీ చేశాడని అన్నారు. విజయ్ ఫ్రెండ్ అవడంతో బిచ్చగాడు మూవీని తమిళంలో చూసానని, ఆ మూవీ తనకు బాగా నచ్చింది.
ఆ మూవీని  తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నామని తెలిపారు. ఈ మూవీ గురించి చర్చించినపుడు తనకు ఇవ్వాల్సిన పారితోషికంతో పాటు మూవీకి బడ్జెట్ అధికం అవుతుండటంతో ఈ మూవీని రీమేక్ చేయలేదని అన్నారు.  లేకపోతే  బిచ్చగాడు చిత్రంలో నేనే నటించేవాడినని శ్రీకాంత్ వెల్లడించారు. ఇక అధిక బడ్జెట్ కారణంగా మేకర్స్ తమిళ సినిమాని తెలుగులోకి డబ్ చేసి ‘బిచ్చగాడు’ టైటిల్ తో రిలీజ్ చేశారని శ్రీకాంత్ తెలిపారు.

Also Read: బాలకృష్ణ వాడే “విగ్” ఖరీదు ఎంతో తెలుసా..? అసలు విషయం బయట పెట్టిన మేకప్ మాన్..!