వెండితెరపై పోలీస్ పాత్ర ఎవర్ గ్రీన్ ఫార్ములా. ఎంతో మంది ఒంటి మీద ఖాకీ డ్రెస్ వేసుకొని రఫ్పాడించారు. ఇతర పాత్రలతో పోలిస్తే పోలీస్ పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. తమ అభిమాన హీరో పోలీస్ పాత్ర చేస్తున్నాడు అంటేనే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి.
Video Advertisement
ప్రభాస్ కూడా తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ స్పిరిట్ మూవీలో ఒంటిపై ఖాకీ డ్రెస్ వేసుకుంటున్నాడు. మొత్తంగా వెండితెరపై పోలీస్ పాత్రల్లో రఫ్పాడించిన ఈ జనరేషన్ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..
#1 నాగ చైతన్య
వెంకట్ ప్రభు దర్శకత్వం లో నాగ చైతన్య హీరోగా వస్తున్నా చిత్రం కస్టడీ. ఈ మూవీ లో నాగ చైతన్య కానిస్టేబుల్ పాత్రలో నటించారు.
#2 విజయ్ దేవరకొండ
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లో విజయ్ పోలీస్ పాత్రలో నటించనున్నారు.
#3 రామ్ పోతినేని
కోలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లింగుస్వామి తో ‘వారియర్’ చిత్రం చేసారు రామ్. ఇందులో పోలీస్ పాత్రలో నటించారు రామ్.
#4 విశ్వక్ సేన్
నాని నిర్మించిన హిట్ మూవీ లో విశ్వక్ సేన్ పోలీస్ గా నటించారు.
#5 బెల్లంకొండ శ్రీనివాస్
దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన సాక్ష్యం, రాక్షసుడు చిత్రాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ పాత్రలో నటించారు.
#6 కిరణ్ అబ్బవరం
సెబాస్టియన్, మీటర్ సినిమాల్లో లో కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రల్లో నటించారు.
#7 అడివి శేష్
నాని నిర్మించిన హిట్ ఫ్రాంచైజ్ లో అడివి శేష్ పోలీస్ గా నటించారు.
#8 సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు వి, హంట్ చిత్రాల్లో పోలీస్ గా నటించారు.
#9 శ్రీ విష్ణు
యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు అల్లూరి మూవీ లో పోలీస్ గా నటించారు.
#10 అల్లరి నరేష్
తాజాగా వచ్చిన ఉగ్రం మూవీ లో అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో నటించారు. అంతకు ముందు కితకితలు చిత్రం లో కూడా ఆయన పోలీస్ గా అలరించారు.
వీరే ఈ జెనెరేషన్ లో పోలీస్ పాత్రల్లో అలరించిన యంగ్ హీరోలు.