అభిమానులను అలరించడానికి మన హీరోలు ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటారు. విభిన్న తరహా పాత్రల ద్వారా మెప్పించడానికి చూస్తారు. అలాంటి పాత్రల్లో లేడీ గెటప్ ఒకటి. దీన్ని చేయడానికి చాలా ధైర్యం కావాలని చెబుతారు. గెటప్ వేయడంతోనే సరిపోదు. అమ్మాయిల్లా హావభావాలు, హొయలొలికించడం కష్టతరమైన పని.
Video Advertisement
ఇప్పుడు ఇలా లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులని అలరించిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..
#1 సీనియర్ నరేష్
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం బళారే విచిత్రం’ సినిమాలో నరేష్ లేడీ గెటప్‌లో నిజంగా అమ్మాయి అనే ఫీలింగ్ కల్గించాడు. ఈ మూవీ లో నరేష్, సుధాకర్ భార్యాభర్తల అవతారమెత్తుతారు.
#2 రాజేంద్రప్రసాద్
రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్‌తో అలరించిన సూపర్‌హిట్ సినిమా ‘మేడమ్’. దీని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రంలో మేడమ్ క్యారెక్టర్‌లో రాజేంద్రప్రసాద్ జీవించాడు.
#3 హరీష్
జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం ‘ఓహో నా పెళ్ళంట’. ఈ మూవీ లో హరీష్ లేడీ గెటప్ వేసి అలరించారు.
#4 చిరంజీవి
‘చంటబ్బాయ్’ మూవీ లో చిరంజీవి అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను..’ అనే పాటలో లేడీ గెటప్‌లో కనిపించి అలరించాడు. అలాగే ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రంలోనూ మన మెగాస్టార్ లేడీ గెటప్‌తో కాసేపు కనిపిస్తాడు.
#5 కమల్‌హాసన్
కమల్‌హాసన్ కూడా పూర్తి స్థాయి లేడీ పాత్రతో మెప్పించాడు. ఆయన భామగా నటించిన ‘భామనే సత్యభామనే’ సినిమా ఘన విజయం సాధించింది. ‘దశావతారం’ సినిమాలోనూ కమల్ పండు ముసలి వేషం వేసి మెప్పించాడు.
#6 అల్లు అర్జున్
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘గంగోత్రి’ మూవీ లో ‘మామయ్యది మొగల్తూరు..’ అనే పాటలో అల్లు అర్జున్ పరికిణి వేసుకుని డాన్స్ చేశాడు.
#7 సుమంత్
‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాలో సుమంత్ లేడీ గెటప్‌తో అలరించాడు.
#8 మంచు మనోజ్
‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో లేడీ గెటప్‌తో అదరగొట్టాడు మనోజ్.
#9 బాలకృష్ణ
కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పాండు రంగడు’ చిత్రంలో బాలకృష్ణ సత్యభామ గెటప్ వేసి అలరించాడు.
#10 అలీ
‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమాలో లేడీ గెటప్‌తో నవ్వులు పూయించాడు అలీ.
#11 విక్రమ్
‘మల్లన్న’ సినిమాలో హీరో విక్రమ్ కూడా లేడీ గెటప్ వేసి అలరించాడు. అలాగే ఇంకొక్కడు మూవీ లో లేడీ గెటప్ వేసాడు విక్రమ్.
#12 వాడు వీడు
బాల దర్శకత్వం లో వచ్చిన ‘వాడు వీడు’ మూవీ లో ఒక పాటలో విశాల్ లేడీ గెటప్ వేశాడు.
#13 శివకార్తీకేయ
‘రెమో’ సినిమాలో హీరో శివకార్తీకేయ లేడీ నర్సు గెటప్‌తో అలరించాడు.
#14 అల్లరి నరేష్
‘కితకితలు’ మూవీ లో ఒక సీన్ లో అల్లరి నరేష్ లేడీ గెటప్ వేశారు.
#15 రజనీకాంత్
‘రోబో’ సినిమాలో ఓ సాంగ్ లో అమ్మాయి గెటప్‌లో కనిపించాడు సూపర్ స్టార్ రజినీకాంత్.
#16 విజయ్ సేతుపతి
‘సూపర్ డీలక్స్’ సినిమాలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించాడు. ఈ మూవీ లో ఆయన గే రోల్ ప్లే చేసారు.
#17 ఉదయ్ కిరణ్
‘జోడి నెం.1 ‘ అనే చిత్రం కోసం ఉదయ్‌కిరణ్ లేడీ గెటప్ వేశాడు. కానీ ఇది అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది.
#18 వెంకటేష్
‘బాడీగాడ్’ చిత్రంలో హాస్టల్‌కు వెళ్లే సన్నివేశంలో లేడీ గెటప్‌లో కనిపిస్తాడు. అలాగే ‘వాసు’ చిత్రంలోని ఒక పాటలోనూ ఆడపిల్లలా తయారై కనిపిస్తాడు.